పాకిస్థాన్‌పై ప్రధాని మోదీ పరోక్షంగా వ్యాఖ్యలు ..

- September 08, 2016 , by Maagulf
పాకిస్థాన్‌పై ప్రధాని మోదీ పరోక్షంగా వ్యాఖ్యలు ..

ఒక దేశం నుంచి మన దేశాలకు వ్యాపిస్తున్న ఉగ్రవాదమే మనందరి ప్రధాన సమస్య అని ప్రధానమంత్రి నరేంద్రమోదీ అన్నారు. లావోస్‌ రాజధాని వియంటియాన్‌లో జరుగుతున్న 14వ ఆసియాన్‌- ఇండియా సదస్సులో గురువారం ప్రధాని మోదీ ప్రసగించారు. ఈ సందర్భంగా పాకిస్థాన్‌పై ప్రధాని మోదీ పరోక్షంగా వ్యాఖ్యలు చేశారు.'ఉగ్రవాదం, ఉగ్ర భావజాలం, హింస ఇతర దేశాలకు వ్యాపించేలా చేస్తున్నారు' అని పాక్‌నుద్దేశించి మోదీ అన్నారు. దీనిపై కలిసికట్టుగా సమష్టి కృషి చేయాలని ఆసియాన్‌ దేశాధినేతలకు పిలుపునిచ్చారు. .ఉగ్రవాదం, సైబర్‌ సెక్యూరిటీపై పోరాడేందుకు భారత్‌ చర్యలు తీసుకోవాలని భావిస్తోందని, దీనికి ఆసియాన్‌ దేశాలు కూడా మద్దతివ్వాలని కోరారు.ప్రధాని మోదీ పాక్‌పై వ్యాఖ్యలు చేయడం ఇది రెండోసారి. ఇటీవల చైనాలో జరిగిన జీ20 సదస్సులోనూ మోదీ.. పాక్‌ వైఖరిపై పరోక్షంగా స్పందించారు. దక్షిణాసియాలోని ఓ దేశం ఉగ్రవాదాన్ని పెంపొదిస్తోందని మోదీ ఆ సమయంలో చెప్పారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com