ఈద్ బ్రేక్లోనూ అందుబాటులో ప్రభుత్వ సేవలు
- September 08, 2016
దుబాయ్ ప్రభుత్వానికి సంబంధించి కొన్ని శాఖలు, వినియోగదారులకు ఈద్ అల్ అదా పబ్లిక్ హాలీడే (సెప్టెంబర్ 11 నుంచి 15 వరకు) సీజన్లోనూ సేవల్ని నఅందించనున్నాయి. సాధారణ ప్రభుత్వ పని గంటలు సెప్టెంబర్ 18 నుంచి యధావిఇగా కొనసాగుతాయి. ఈద్ లాంగ్ బ్రేక్ సందర్భంగా ప్రత్యేక పని గంటల్లో మాత్రమే వివిధ సేవలు వినియోగదారులకు అందుతాయి. దుబాయ్ మెట్రోకి చెందిన రెడ్ మరియు గ్రీన్ లైన్స్ ఉదయం 2 గంటల వరకు కొనసాగుతాయి (సెప్టెంబర్ 13) వరకు. మామూలుగా అయితే ఉదయం 5.30 నిమిషాలకు ప్రారంభమవుతాయి ఈ సేవలు. పబ్లిక్ పార్కింగ్ సెప్టెంబర్ 11 నుంచి సెప్టెంబర్ 17 వరకు ఉచితంగా లభిస్తుంది. ఫిష్ మార్కెట్ మరియు మల్టీలెవెల్ పార్కింగ్స్లో ఈ ఉచితం వర్తించదు. హెల్త్ కేర్ రంగాన్ని తీసుకుంటే దుబాయ్ హెల్త్ అథారిటీకి చెందిన కొన్ని బ్రాంచ్లలో ఇరవై నాలుగు గంటలూ సేవలు అందుబాటులో ఉంటాయి. దుబాయ్ హాస్పిటల్లోని క్లినిక్స్, రసీద్ హాస్పిటల్, లతిఫా హాస్పిటల్ మాత్రం సెప్టెంబర్ 11 నుంచి 15 వరకు మూసివేయబడ్తాయి. అల్ ముహైస్నాహ్ హెల్త్ సెంటర్ 11 నుంచి 15 వరకు ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంటల వరకు తెరచి ఉంటాయి. ఇమ్మిగ్రేషన్ విభాగంలో అల్ త్వార్, అల్ మనారా బ్రాంచ్లు ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు సేవలందిస్తాయి. బిజిఎస్ విషయానికి వస్తే సార్జాలో చాంబర్ కార్యాలయానికి సర్టిఫికెట్ ఆఫ్ ఆరిజన్, సర్టిఫికెట్స్ ఆఫ్ మెంబర్ షిప్ కోసం 14, 15 తేదీల్లో ఉదయం 9 గంటల నుంచి 1 గంటల వరకు సేవలు అందుకోవచ్చు.
తాజా వార్తలు
- గ్లోబల్ సమిట్ 2025 ను గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ప్రారంభిం చారు
- తిరుపతి విద్యార్థిని పై దాడి: హోంమంత్రి కఠిన స్పందన
- గూగుల్ స్ట్రీట్, మైక్రోసాఫ్ట్ రోడ్ ప్రతిపాదనపై సీఎం రేవంత్
- బహ్రెయిన్, యూఏఈ పై ఇరాన్ కామెంట్స్..జీసీసీ సీరియస్..!!
- ఖతార్ లో నేషనల్ వాలంటీర్ వర్క్ ల్యాబ్ ప్రారంభం..!!
- 36, 610 మంది ప్రవాసులను బహిష్కరించిన కువైట్..!!
- సౌదీలో ఇల్లీగల్ రైడ్..వారంలో 1,278 మంది అరెస్టు..!!
- వింటర్ ట్రావెల్ ఇల్నెస్..డాక్టర్స్ వార్న్..!!
- మస్కట్ లో సునామీ పై మూడు రోజుల క్యాంపెయిన్..!!
- హైదరాబాద్ లో ప్రారంభమైన గ్లోబల్ సమ్మిట్ సమావేశం







