పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం

- September 12, 2016 , by Maagulf
పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం

పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో తెలంగాణలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. మంగళవారం ఉదయం హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. మియాపూర్‌, కూకట్‌పల్లి, ఎర్రగడ్డ, బేగంపేట, సికింద్రాబాద్‌, ఉప్పల్‌, తార్నాక, నాచారం, ఖైరాతాబాద్‌, సోమాజీగూడ, మలక్‌పేట్‌, దిల్‌సుఖ్‌నగర్‌, ఎల్బీనగర్‌, హయత్‌నగర్‌, పెద్ద అంబర్‌పేట తదితర ప్రాంతాల్లో వర్షం పడింది. ఆయా ప్రాంతాల్లో రహదారులు జలమయమయ్యాయి. భారీ వర్షాలకు రహదారులపై గుంతల్లో నీరు నిలిచి వాహనచోదకులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఉదయం కార్యాలయాలకు వెళ్లే ఉద్యోగులు, పాఠశాలలు, కళాశాలలకు వెళ్లే విద్యార్థులు అవస్థలు పడ్డారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com