బాంబు దాడుల సూత్రదారుడు హతం..
- September 12, 2016
అమెరికా డ్రోన్ దాడిలో ఐసిస్ నేత, అధికార ప్రతినిధి అబు మహ్మద్ అల్ అద్నాని గత నెలలో మరణించినట్లు పెంటగాన్ ప్రకటించింది. గత నెల 30న సిరియాకు చేరువలోని అల్ బబ్ ప్రాంతంలో ప్రేడేటర్ డ్రోన్ జరిపిన బాంబుదాడుల్లో ఐసిస్ రిక్రూటర్, బాంబు దాడుల సూత్రధారి అల్ అద్నానిని మట్టుపెట్టినట్లు పేర్కొంది. అద్నాని పారిస్, బ్రస్సెల్స్, ఇస్తాంబుల్, బంగ్లాదేశ్, రష్యా విమానం, అంకారా ఆత్మాహుతి దాడుల సూత్రధారని చెప్పింది. ఐసిస్ పై వరుసగా చేస్తున్న దాడుల్లో ఇది అత్యంత కీలకమైందని తెలిపింది.గత కొద్ది దాడుల్లో ఐసిస్ ను కీలక విభాగాల్లో ముందుకు నడిపించే లీడర్లను హతమార్చినట్లు చెప్పింది.దీంతో ఐసిస్ ఆర్ధికంగా, మిలటరీ పరంగా క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొంటోందని తెలిపింది. అద్నాని తామే హతం చేశామని రష్యా ప్రకటించడంపై పెంటగాన్ స్పందించింది. రష్యా వ్యాఖ్యలు హాస్యాస్పదమని పెంటగాన్ అధికారులు వ్యాఖ్యానించారు.
తాజా వార్తలు
- పాన్-ఆధార్ లింకింగ్ కు రేపే చివరి తేదీ
- అనధికార ఆయుధాల రవాణాపై సౌదీ ఫోకస్..!!
- షేక్ ఇసా బిన్ సల్మాన్ కాజ్వే- అవెన్యూ 105 బ్రిడ్జి ప్రారంభం..!!
- ఖతార్ లో జనవరి 19 నుండి DIMDEX 2026..!!
- సహల్ యాప్ ద్వారా రెసిడెన్సీ తొలగింపు సర్వీస్..!!
- దుబాయ్ లో పబ్లిక్ పార్క్ వేళలు పొడిగింపు..!!
- ఫేక్ CPA వెబ్సైట్ ట్రాప్..ROP హెచ్చరికలు..!!
- JEE అడ్వాన్స్డ్ 2026 షెడ్యూల్ వచ్చేసింది..
- శ్రీవారిని దర్శించుకున్న సీఎం రేవంత్
- తిరుమల మాదిరిగా యాదగిరిగుట్టలో ప్రత్యేక సేవలు







