డ్రైఫ్రూట్స్‌ పలావ్‌

- August 06, 2015 , by Maagulf
డ్రైఫ్రూట్స్‌ పలావ్‌

డ్రైఫ్రూట్స్‌ పలావ్‌
కావలిసిన పదార్ధాలు
బాస్మతి రైస్‌ - కప్పు
జాజికాయ పొడి - చెంచా
వేయించిన ఉల్లిపాయ ముక్కలు - కొన్ని
వేయించిన పచ్చిమిర్చి ముక్కలు - కొన్ని
యాలకులు, లవంగాలు - మూడేసి చొప్పుున
దాల్చిన చెక్క - చిన్న ముక్క
జీలకర్ర, వాము - అరచెంచా చొప్పున
నెయ్యిలేదానూనె - తగినంత
ఉప్పు - తగినంత
కారం - అరచెంచా
పన్నీర్‌ ముక్కలు వేయించినవి - అరకప్పు
జీడిపప్పు, బాదం, కిస్‌మిస్‌ - కొన్ని
చక్కెర - కొద్దిగా
తయారీ
బాణలిలో చెంచా నెయ్యి వేడి చేసి ఇరవై నిముషాల ముందు నానబెట్టిన బాస్మతీ బియ్యాన్ని వేసి వేయించాలి. తరువాత దానిలో ఒకటిన్నర కప్పు నీళ్లు పోసి జాజికాయ పొడీ, తగినంత ఉప్పు వేసి కొంచెం పొడి పొడిగా ఉండేలా ఉడికించుకోవాలి. తరువాత మరో బాణలిలో మరి కొంచెం నెయ్యి వేసి దానిలో పనీర్‌ ముక్కలు వేసి వేయించాలి. తరువాత జీలకర్రా, వామూ, దాల్చినచెక్కా, యాలకులూ, లవంగాలూ, మిరియాలూ, చక్కెరా వేసేయాలి. మసాలా పదార్ధాలు అన్నీ వేగాక బాదం, కిస్‌మిస్‌, జీడిపప్పు కూడా వేసి బాగా వేయించుకోవాలి. తరువాత ఉడికించి పెట్టుకున్న అన్నం వేసి దాని మీద కారం చల్లి నెమ్మదిగా కలపాలి. అన్నం కూడా బాగా వేగినాక పైన వేయించిన ఉల్లిపాయ ముక్కలు వేస్తే డ్రైఫ్రూట్స్‌ పులావ్‌ రెడీ.


 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com