ఒప్పమ్ రీమేక్‌లో..కమల్..
- September 16, 2016
మోహన్‌లాల్, ప్రియదర్శన్ కాంబినేషన్‌లో రూపొంది మాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామీ సృష్టిస్తున్న చిత్రం 'ఒప్పమ్'. క్రైమ్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ చిత్రంలో మోహన్‌లాల్ పుట్టుకతోనే అంధుడు. అంధుడైనప్పటికీ శబ్ధం, స్పర్శ, వాసన వంటి అంశాలతో మనుషులను, వస్తువులను పసిగట్టడంలో దిట్ట. ఓ అపార్ట్ మెంట్‌లో ఎలివేటర్ ఆపరేటర్‌గా పని చేస్తున్న ఆయన అనుకోకుండా ఓ రోజు ఒక మర్డర్ కేసులో ఇరుక్కుంటాడు. అతని శక్తి సామర్థ్యాలే ఆయుధాలుగా మలుచుకుని ఆ కేసులో నుంచి ఎలా బయట పడ్డాడనే నేపథ్యంతో ఈ చిత్రాన్ని దర్శకుడు ప్రియదర్శన్ రూపొందించారు. ప్రస్తుతం కేరళలో సంచలనం క్రియేట్ చేస్తున్న ఈచిత్రం తమిళంలో రీమేక్ కానుంది.కమల్‌హాసన్ కథానాయకుడిగా సముద్రఖని దర్శకత్వంలో ఈ చిత్రాన్ని రీమేక్ చేసేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు. 'ఒప్పమ్' వంటి చిత్రాన్ని రీమేక్ చేయటం ఆనందంగా, గర్వంగా ఉంది. త్వరలోనే ఈ చిత్రం సెట్స్‌పైకి వెళ్ళనుంది' అని దర్శకుడు సముద్రఖని ట్వీట్‌లో పేర్కొన్నారు.
తాజా వార్తలు
- IPL 2026: గుజరాత్ పై ముంబై ఘన విజయం
- నటుడు జగపతిబాబు చేతుల మీదగా రామ్ కొణికి సరికొత్త 'కొణికి లక్స్' స్కిన్ కేర్ ప్రారంభం
- మే 1 నుంచి తిరుమలలో శ్రీవారి దర్శనానికి కొత్త నిబంధనలు
- JEE మెయిన్స్ తుది ఫలితాలు వచ్చేశాయ్..
- ఏపీకి కేంద్ర ప్రభుత్వం గొప్ప శుభవార్త
- కాంగ్రెస్ ప్రభుత్వంకు కేసీఆర్ డెడ్‌లైన్
- కరీంనగర్లో ఘనంగా 'కార్తికేయ జువెలరీస్' ప్రారంభోత్సవం
- యూఏఈలో ఉగ్రవాద సంస్థ భగ్నం: దేశ భద్రతను దెబ్బతీయాలన్న కుట్ర విఫలం
- బహ్లా కోటలో నాలుగు కొత్త మ్యూజియమ్స్ ప్రారంభం..!!
- ఖతార్ మున్సిపాలిటీలో ఈకో ఫ్రెండ్లీ వెహికల్స్, పరికరాలు..!!









