యలమంచిలిలో జన్మభూమి ఎక్స్‌ప్రెస్‌కు ఘనస్వాగతం

- September 16, 2016 , by Maagulf
యలమంచిలిలో జన్మభూమి ఎక్స్‌ప్రెస్‌కు  ఘనస్వాగతం

విశాఖ జిల్లా యలమంచిలిలో జన్మభూమి ఎక్స్‌ప్రెస్‌కు స్థానికులు ఘనస్వాగతం పలికారు. విశాఖ-సికింద్రాబాద్‌ జన్మభూమి ఎక్స్‌ప్రెస్‌ రైలు తొలిసారిగా యలమంచిలిలో ఆగడంతో స్థానికులు హర్షం వ్యక్తం చేశారు. అనకాపల్లి ఎంపీ ముత్తంశెట్టి శ్రీనివాసరావు జన్మభూమి ఎక్స్‌ప్రెస్‌లో విశాఖ నుంచి యలమంచిలి విచ్చేశారు. జన్మభూమి ఎక్స్‌ప్రెస్‌కు యలమంచిలిలో హాల్ట్‌ సదుపాయం కల్పించాలని స్థానికులు గత కొన్నిసంవత్సరాల నుంచి విజ్ఞప్తిచేయగా ఎట్టకేలకు వారి ఆకాంక్ష నెరవేరింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com