'ఈడు గోల్డ్ ఎహే' ఆడియో రిలీజ్..
- September 16, 2016
డాన్సింగ్ స్టార్ సునీల్ .. బిందాస్, రగడ, దూసుకెళ్తా వంటి సూపర్‌హిట్ చిత్రాల దర్శకుడు వీరు పోట్ల కాంబినేషన్లో వస్తున్న చిత్రం 'ఈడు గోల్డ్ ఎహే'. ఎటివి సమర్పణలో ఎ.కె. ఎంటర్టైన్మెంట్స్ (ఇండియా) ప్రై. లిమిటెడ్ పతాకంపై రామబ్రహ్మం సుంకర నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని విజయదశమి కానుకగా అక్టోబర్ 7న వరల్డ్‌వైడ్‌గా రిలీజ్ చెయ్యడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఇక ఆడియోను నాలుగు పట్టణాల్లో విడుదల చేయడానికి ప్లాన్ చేశారు. ఈ ఆల్బమ్‌లోని మొదటి పాటను సెప్టెంబర్ 21న హైదరాబాద్‌లో, రెండో పాటను 22న వైజాగ్‌లో, మూడో పాటను 23న రాజమండ్రిలో, నాలుగో పాటను సెప్టెంబర్ 24న విజయవాడలో రిలీజ్ చెయ్యబోతున్నాట్టు నిర్మాత రామబ్రహ్మం సుంకర తెలియజేశారు.ఆదిత్య మ్యూజిక్ ద్వారా ఈ ఆడియో మార్కెట్లోకి విడుదలవుతోంది. సునీల్ సరసన సుష్మారాజ్, రిచా పనయ్ హీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రంలో జయసుధ,నరేష్, పృధ్వీ, పోసాని, బెనర్జీ, వెన్నెల కిషోర్, షకలక శంకర్, ప్రభాస్, రాజా రవీంద్ర తదితరులు ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు.
తాజా వార్తలు
- చర్చలు విఫలమైతే బాంబులే.. ట్రంప్ హెచ్చరిక
- ఇరాన్‌తో మునుపటి సంబంధాలు అసాధ్యం..!!
- డిఫెన్స్ ఫోర్స్ సన్నద్ధతను సమీక్షించిన కింగ్ హమద్ ..!!
- 1200 ఫ్లైట్స్ నడుపుతున్న జజీరా ఎయిర్వేస్..!!
- సౌదీ అరేబియాలో 1.6% తగ్గిన ప్రాపర్టీ ధరలు..!!
- బర్కాలో ఆసియా దేశస్థుడు అరెస్టు..!!
- ఖతార్‌కు విదేశీ విమానయాన సంస్థల సేవలు పునరుద్ధరణ..!!
- IPL 2026: గుజరాత్ పై ముంబై ఘన విజయం
- నటుడు జగపతిబాబు చేతుల మీదగా రామ్ కొణికి సరికొత్త 'కొణికి లక్స్' స్కిన్ కేర్ ప్రారంభం
- మే 1 నుంచి తిరుమలలో శ్రీవారి దర్శనానికి కొత్త నిబంధనలు









