ఒమన్‌లో కొత్త రాగి నిక్షేపాలు
- September 17, 2016
మస్కట్: లండన్‌కి చెందిన మైనింగ్ సంస్థ సవన్నా రిసోర్సెస్, ఒమన్‌లో బ్లాక్ 4, బ్లాక్ 5 ప్రాంతాల్లో రాగి నిక్షేపాల్ని భారీగా కనుగొన్నట్లు వెల్లడించింది. బ్లాక్ 4 - అల్ బేదా ప్రాంతంలో, బ్లాక్ 5 - అల్ మహబ్ ప్రాంతాల్లో ఈ నిక్షేపాలు ఉన్నాయి. ఈ ప్రాంతాల్లోని ఐదు డిగ్గింగ్ సైట్స్ ద్వారా నిక్షేపాల వివరాల్ని వెల్లడించారు. 23.47 శాతం మెటల్ ఈ ప్రాంతాల్లో దొరుకుతుందని సవన్నా సంస్థ వివరించింది. 10.7 నుంచి 29 మిలియన్ టన్నుల కాపర్ ఓర్ని వెలికి తీసే అవకాశం ఉందనీ, దీన్నుంచి 150,000 నుంచి 700,000 టన్నుల కాపర్ని తీయవచ్చని సవన్నా వర్గాలు వెల్లడించాయి. మస్కట్ నుంచి నార్త్ వెస్ట్ దిశలో 180 కిలోమీటర్ల దూరంలో ఈ నిక్షేపాల్ని సంస్థ కనుగొంది. ఒమన్‌తోపాటు మొజాంబిక్లోనూ సవన్నా సంస్థ శ్రద్ధ చూపుతోంది.
తాజా వార్తలు
- IPL 2026: గుజరాత్ పై ముంబై ఘన విజయం
- నటుడు జగపతిబాబు చేతుల మీదగా రామ్ కొణికి సరికొత్త 'కొణికి లక్స్' స్కిన్ కేర్ ప్రారంభం
- మే 1 నుంచి తిరుమలలో శ్రీవారి దర్శనానికి కొత్త నిబంధనలు
- JEE మెయిన్స్ తుది ఫలితాలు వచ్చేశాయ్..
- ఏపీకి కేంద్ర ప్రభుత్వం గొప్ప శుభవార్త
- కాంగ్రెస్ ప్రభుత్వంకు కేసీఆర్ డెడ్‌లైన్
- కరీంనగర్లో ఘనంగా 'కార్తికేయ జువెలరీస్' ప్రారంభోత్సవం
- యూఏఈలో ఉగ్రవాద సంస్థ భగ్నం: దేశ భద్రతను దెబ్బతీయాలన్న కుట్ర విఫలం
- బహ్లా కోటలో నాలుగు కొత్త మ్యూజియమ్స్ ప్రారంభం..!!
- ఖతార్ మున్సిపాలిటీలో ఈకో ఫ్రెండ్లీ వెహికల్స్, పరికరాలు..!!









