రాస్ అల్ ఖైమాహ్ బస్సులలో... ప్రయాణిస్తూ చదువుకోండి
- September 18, 2016
రాస్ అల్ ఖైమాహ్ ట్రాన్స్పోర్ట్ అథారిటీ (రాక్ టా ) ప్రయాణికులలో చదువుని ప్రోత్సహించడానికి ఒక మంచి కార్యక్రమాన్ని చేపట్టింది.రాస్ అల్ ఖైమాహ్ ట్రాన్స్పోర్ట్ అథారిటీ ' పఠన యాత్ర ' ప్రకారం ఎకనామిక్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్ సహకారంతో, ప్రయోగాత్మకంగా ప్రారంభంలో ప్రజా బస్సులలో180 పుస్తకాలకు పంపిణీ చేస్తారు. అధికార వర్గాలు తెలిపిన వివరాల ప్రకారం, ఈ పుస్తకాలు పంపిణి ప్రారంభంలో రెండు ప్రజా బస్సులలో మరియు 10 కార్లలో పంపిణీ చేయబడుతుంది. తర్వాత "ప్రతి ప్రయాణీకునికి ఒక పుస్తకం మరియు సాధారణ సమస్యలపై అవగాహన అభివృద్ధి కోసం మూడు కరపత్రాలు ఇవ్వబడతాయి. ఈ సందర్భంగా డిప్యూటీ దర్శకుడు అహ్మద్ లోబడి అల్ తుణైజి మాట్లాడుతూ, రోజూ పుస్తకాలు నవీకరించబడతాయని మరియు నెమ్మదిగా ఎక్కువ పుస్తకాలు తరువాత దశల్లో చేర్చబడుతుందని చెప్పారు. రాస్ అల్ ఖైమాహ్ ట్రాన్స్పోర్ట్ అథారిటీ అరబిక్, ఇంగ్లీషు మరియు ఉర్దూ మూడు భాషల్లో ప్రచురితమైన పుస్తకాలను ప్రయాణీకులకు పుస్తకాలను ఇస్తారు. ఈ పుస్తకాల ద్వారా ప్రయాణీకుల 'జ్ఞానాభివృద్ధి కోసం' సహాయ పడతాయని మరియు వాటిని మరింత ఎక్కువ మంది చదివేలా ప్రోత్సహిస్తున్నామని వివరిస్తూ , ప్రయాణికుల తమ గమ్యస్థానం చేరిన తర్వాత తరువాత వాహనం దిగేవారు ఆ పుస్తకాన్నితిరిగి అప్పగించాల్సి ఉంటుంది.
తాజా వార్తలు
- మామిడి రసం తాగి 400 మందికి ఫుడ్ పాయిజన్.. 60 మంది పరిస్థితి విషమం!
- ఏపీ ప్రజలకు బిగ్ అలర్ట్..
- తెలంగాణ భవన్లో కేసీఆర్ కీలక సమావేశం
- తెలంగాణలో బస్సులు బంద్ ..ప్రభుత్వం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు !
- రియాద్ లో ఘనంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జన్మదిన వేడుకలు
- హాంకాంగ్‌లో ఘనంగా ఉగాది వేడుకలు
- దుబాయ్ ఎయిర్పోర్ట్ ని సందర్శించిన క్రౌన్ ప్రిన్స్ షేక్ హమ్దాన్
- తమిళనాడులో ముగిసిన ఎన్నికల ప్రచారం
- ఘనంగా గురూజీ రామ్ రతన్ జీ జయంతి వేడుకలు
- బాణసంచా ఫ్యాక్టరీలో పేలుడు..ఆరుగురు మృతి..









