'ది గ్రేట్ ఫాదర్' చిత్రం లో స్నేహ...
- September 18, 2016
'సన్నాఫ్ సత్యమూర్తి' చిత్రంతో గత ఏడాది ప్రేక్షకుల ముందుకు వచ్చిన స్నేహ ఆ తర్వాత ఏ చిత్రంలోనూ నటించలేదు. ప్రస్తుతం ఆమె మలయాళ నటుడు మమ్మూటీ కథానాయకుడుగా తెరకెక్కిస్తున్న చిత్రంలో ఆయన భార్యగా నటిస్తున్నారు. ఈ చిత్రం షూటింగ్లో పాల్గొన్నట్లు స్నేహ సోషల్‌మీడియా ద్వారా తెలిపింది. 'హాయ్! మమ్మూటీతో 'ది గ్రేట్ ఫాదర్' సినిమా ప్రారంభమైంది. కొంచెం బిడియంగా ఉంది. ఈ చిత్రంలో నా భాగస్వామ్యం ఉండటం ఆనందంగా ఉంది' అని స్నేహ ట్వీట్ చేసింది. ఈ సందర్భంగా ఒక ఫొటోను షేర్ చేశారు. దీన్ని స్నేహ భర్త ప్రసన్న రీట్వీట్ చేశారు.'ది గ్రేట్ ఫాదర్' చిత్రానికి హనీఫ్ దర్శకత్వం వహిస్తున్నారు. బేబీ సారా అర్జున్ ఇందులో ప్రధాన పాత్రను పోషిస్తోంది. స్నేహ దాదాపు ఆరేళ్ల తర్వాత నటిస్తున్న మలయాళ చిత్రమిది.
తాజా వార్తలు
- ఏపీ ప్రజలకు బిగ్ అలర్ట్..
- తెలంగాణ భవన్లో కేసీఆర్ కీలక సమావేశం
- తెలంగాణలో బస్సులు బంద్ ..ప్రభుత్వం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు !
- రియాద్ లో ఘనంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జన్మదిన వేడుకలు
- హాంకాంగ్‌లో ఘనంగా ఉగాది వేడుకలు
- దుబాయ్ ఎయిర్పోర్ట్ ని సందర్శించిన క్రౌన్ ప్రిన్స్ షేక్ హమ్దాన్
- తమిళనాడులో ముగిసిన ఎన్నికల ప్రచారం
- ఘనంగా గురూజీ రామ్ రతన్ జీ జయంతి వేడుకలు
- బాణసంచా ఫ్యాక్టరీలో పేలుడు..ఆరుగురు మృతి..
- ఆపిల్ కు కొత్త సీఈఓ జాన్ టెర్నస్









