'ది గ్రేట్‌ ఫాదర్‌' చిత్రం లో స్నేహ...

- September 18, 2016 , by Maagulf
'ది గ్రేట్‌ ఫాదర్‌' చిత్రం లో స్నేహ...

 'సన్నాఫ్‌ సత్యమూర్తి' చిత్రంతో గత ఏడాది ప్రేక్షకుల ముందుకు వచ్చిన స్నేహ ఆ తర్వాత ఏ చిత్రంలోనూ నటించలేదు. ప్రస్తుతం ఆమె మలయాళ నటుడు మమ్మూటీ కథానాయకుడుగా తెరకెక్కిస్తున్న చిత్రంలో ఆయన భార్యగా నటిస్తున్నారు. ఈ చిత్రం షూటింగ్‌లో పాల్గొన్నట్లు స్నేహ సోషల్‌మీడియా ద్వారా తెలిపింది. 'హాయ్‌! మమ్మూటీతో 'ది గ్రేట్‌ ఫాదర్‌' సినిమా ప్రారంభమైంది. కొంచెం బిడియంగా ఉంది. ఈ చిత్రంలో నా భాగస్వామ్యం ఉండటం ఆనందంగా ఉంది' అని స్నేహ ట్వీట్‌ చేసింది. ఈ సందర్భంగా ఒక ఫొటోను షేర్‌ చేశారు. దీన్ని స్నేహ భర్త ప్రసన్న రీట్వీట్‌ చేశారు.'ది గ్రేట్‌ ఫాదర్‌' చిత్రానికి హనీఫ్‌ దర్శకత్వం వహిస్తున్నారు. బేబీ సారా అర్జున్‌ ఇందులో ప్రధాన పాత్రను పోషిస్తోంది. స్నేహ దాదాపు ఆరేళ్ల తర్వాత నటిస్తున్న మలయాళ చిత్రమిది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com