ఖైదీలకు డ్రోన్ హెలికాఫ్టర్ ద్వారా మాధకద్రవ్యాల సరఫరా

- September 18, 2016 , by Maagulf
ఖైదీలకు డ్రోన్ హెలికాఫ్టర్  ద్వారా మాధకద్రవ్యాల సరఫరా

 సాంకేతిక పరిజ్ఞానాన్ని ప్రభుత్వం ఏ విధంగా వినియోగించుకొంటుందో  ఏమోగానీ...విద్రోహశక్తులు మాత్రం విన్నూత్న ప్రయోగాలు చేస్తూ..అధికారులకు మతులు పోగొడుతున్నారు. 

సెంట్రల్ జైల్  వద్ద ఫస్ట్ లెఫ్టినెంట్ జనరల్  జైలు హాల్ పై భాగంలో  ఒక వింత ధ్వని వినడం జరిగింది. ఆ శబ్దం ఏమై ఉంటుందోనని ఆయన నిశితంగా పరిశీలన చేయగా ఒక రిమోట్ తో  నియంత్రించే డ్రోన్ హెలికాఫ్టర్ చూడటం జరిగింది. దానితో విస్తు పోయిన ఆ అధికారి మరింత పరీక్షగా ఆ ఎగిరే  బొమ్మలాంటి హెలికాఫ్టర్ అడుగు భాగంలో ఒక  పెద్ద ప్యాకేజీ ఉందని గ్రహించారు. ఆ  అధికారి ప్యాకేజీ తెరిచి చూడగా అనుమానిత తెల్లని రంగు గల పౌడర్ ఉన్న  మూడు ప్లాస్టిక్ సంచులు దొరికేయి. వాటిని పరిశీలించి చూడగా అదో శక్తివంతమైన మత్తు కల్గించే మాదక ద్రవ్యంగా గుర్తించడం జరిగింది. జైలులో ఉన్న ఖైదీలలో కొందరకి ఈ తరహా సరఫరా ద్వారా సరఫరా చేస్తున్నట్లుగా ఆయన గ్రహించి వెంటనే ఉన్నతాధికారులకు ఈ సమాచారం అందించారు. ఈ అక్రమ రవాణా పై ఒక  కేసు  దాఖలు చేశారు. ప్రస్తుతం దర్యాప్తు పురోగతిలో ఉంది.          

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com