సముద్ర కెరటాలతో గల్లంతైన ఒమాని బాలుని మృతదేహం లభ్యం

- September 18, 2016 , by Maagulf
సముద్ర కెరటాలతో గల్లంతైన ఒమాని బాలుని మృతదేహం లభ్యం

మస్కట్ : గత బుధవారం నాడు సముద్రంలోనికి వెళ్ళి కెరటాల మధ్య తప్పిపోయిన  ఓ 10 ఏళ్ల బాలుని మృతదేహంను  శనివారం ఉదయం జలాన్ బాణీ బు ఆలీ  సువైహ్  ప్రాంతంలో కనుగొన్నారు. 

మూడు రోజుల క్రితం సముద్రంలో గల్లంతైన బాలుని శవంను గుర్తించిన స్థానిక గ్రామవాసులు సివిల్ డిఫెన్స్ మరియు అంబులెన్స్ పబ్లిక్ అథారిటీకి సమాచారం అందించారు. బాలుని ఆచూకీ కోసం  సివిల్ డిఫెన్స్ మరియు అంబులెన్స్ పబ్లిక్ అథారిటీకి మరియు నివాసితులు ఆ బాలుని కోసం  గత మూడు రోజులుగా అన్వేషణ చేస్తుంది.  
ఆ బాలుని పేరు చెప్పేందుకు ఆసక్తి చూపని అధికారులు, బుధవారం జరిగిన దుర్ఘటన వివరాల తెలిపారు. మస్కట్ లోని  క్కురుం జిల్లాలో ఒక బీచ్ వద్ద ఈతకు వెళ్ళినపుడు ఈ విషాదం జరిగింది. ఆ బాలునితో పాటు మరో ఇద్దరు పిల్లలు  సైతం సముద్ర కెరటాలతో కొట్టుకుపోయారు. కానీ నివాసితులు వారిఇరువుర్ని రక్షించగలిగేరు..కానీ ఆ ఒక్క ఒమాన్ బాలుడి ఆచూకీ లభ్యం కాలేదు. ప్రమాదాలు జరిగే ఆ ప్రాంతంలో ఈతకు వెళ్ళరాదని, కఠినమైన సముద్ర కెరటాలతో మునిపోతారని ఆ ప్రమదాన్ని  నివారించేందుకు   అధికారుల నుండి అనేక హెచ్చరికలు ఉన్నప్పటికీ ఈత వెళ్ళి పలువురు ప్రాణాలు కోల్పోతున్నారు. గత సంవత్సరంలో సముద్రంలో మునిగిపోయిన కేసులు 10 వరకు ఒమన్ లో  నమోదైనప్పటకీ అధికారుల హెచ్చరికలను ఏ మాత్రం పట్టించుకోకుండా పలువురు వ్యవహరిస్తున్నారు.  సముద్రంలో  శక్తివంతమైన ప్రవాహాల కారణంగా ఈతని శక్తివంతంగా కొట్టలేరని ముఖ్యంగా పిల్లలు మునిగిపోవడం తరచూ జరుగుతుందని అధికారులు హెచ్చరిస్తున్నారు.  పిల్లల  నిర్లక్ష్య ప్రవర్తన వ్యతిరేకంగా తల్లిదండ్రులు హెచ్చరించడానికి సివిల్ డిఫెన్స్ మరియు అంబులెన్స్ పబ్లిక్ అథారిటీకి  అనేక ప్రచారాలు నిర్వహిస్తుందని అధికారులు పేర్కొన్నారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com