నేడు 'భెల్' కు శంకుస్థాపన చేయనున్న ఏ.పి ముఖ్యమంత్రి

- September 18, 2016 , by Maagulf
నేడు 'భెల్' కు శంకుస్థాపన చేయనున్న ఏ.పి ముఖ్యమంత్రి

 రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు నిమ్మకూరు పర్యటనకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశామని సంయుక్త కలెక్టర్‌ గంధం చంద్రుడు పేర్కొన్నారు. మండలంలోని నెమ్మలూరులో భారత్‌ ఎలక్టాన్రిక్స్‌ లిమిటెడ్‌(బెల్‌) సంస్థ ఆధ్వర్యంలో నిర్మిస్తున్న అడ్వాన్స్‌ నైట్‌విజన్‌ ప్రోడక్ట్స్‌ కర్మాగారం శంకుస్థాపనకు సంబంధించిన ఏర్పాట్లను ఆదివారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా అధికారులకు సలహాలు, సూచనలు ఇస్తూ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సదరు కర్మాగార నిర్మాణానికి భూమిపూజ చేసి, శంకుస్థాపన చేయనున్నారని, ఈ కార్యక్రమం పూర్తిస్థాయిలో విజయవంతం కావడానికి బెల్‌ ప్రతినిధులు, అధికారులు సమస్వయంతో పనిచేసి పనులను పూర్తి చేయాలన్నారు. 

ముఖ్యమంత్రి విజయవాడ నుంచి హెలికాప్టర్లో బయలుదేరి సభా ప్రాంగణం వద్ద ఏర్పాటు చేసిన హెలిప్యాడ్‌కి చేరుకుంటారని, సభాస్థలికి చేరుకునే మార్గాన్ని సుందరంగా తీర్చిదిద్దాలన్నారు. ఇదేవిధంగా భూమిపూజ, శంకుస్థాపనకు సంబంధించిన ఏర్పాట్లను త్వరితగతిని పూర్తిచేయాలని ఆదేశించారు. ఈ కార్యక్రమానికి పరిసర ప్రాంతాల నుంచి 10 వేల మందికి పైగా ప్రజలు వచ్చే అవకాశం ఉందని ఇందుకు అవసరమైన ఏర్పాట్లు చేయాలన్నారు. కార్యక్రమానికి హాజరయ్యేందుకు తరలి వచ్చే ప్రజలకు తాగునీరు, ఆహార సౌకర్యాలను సమకూర్చాలన్నారు.

 పటిష్ఠమైన భద్రతా ఏర్పాట్లు చేసి, బారికేడ్లు నిర్మించాలని పోలీసు అధికారులకు సూచించారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com