ఆరోగ్యంగానే ఉన్నా... వదంతులు నమ్మకండి: గౌండమణి

- September 18, 2016 , by Maagulf
ఆరోగ్యంగానే ఉన్నా... వదంతులు నమ్మకండి: గౌండమణి

 తన ఆరోగ్యంపై ప్రసార మాధ్యమాల్లో వస్తున్న పుకార్లను నమ్మవద్దని, తాను ఆరోగ్యంగానే ఉన్నానని ప్రముఖ తమిళ సినీ హాస్యనటుడు గౌండమణి ఓ ప్రకటనలో స్పష్టం చేశారు. గౌండమణి ఆరోగ్యం ఆందోళన కరంగా ఉందని, కొనఊపిరితో కొట్టుమిట్టాడు తున్నారంటూ శనివారం ప్రసార మాధ్యమాల్లో వార్తలు వెలువడ్డాయి. ఫేస్‌బుక్‌, వాట్సప్‌లలో పుకార్లు దావానలంలా వ్యాపించాయి. ఈ నేపథ్యంలో ఆదివారం ఉదయం తనను కలుసుకున్న సీని పీఆర్‌ఓతో గౌండమణి మాట్లాడుతూ తాను సంపూర్ణ ఆరోగ్యంతోనే ఉన్నానని, ఆస్పత్రిలో చికిత్సలు పొందలేదని స్పష్టం చేశారు. త్వరలో ఓ చిత్రంలో నటించేందుకు కథను వింటున్నానని, ఆ వివరాలను త్వరలో ప్రకటిస్తానని గౌండమణి తెలిపారు.తన ఆరోగ్యం గురించి వస్తున్న పుకార్లను నమ్మవద్దని గౌండమణి తన అభిమానులకు విజ్ఞప్తి చేశారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com