చికెన్‌ ఖీమా పావ్‌

- August 08, 2015 , by Maagulf
చికెన్‌ ఖీమా పావ్‌

చికెన్‌ ఖీమా పావ్‌
చికెన్‌ ఖీమా - పావుకిలో
పావ్‌ బాజీ బన్నులు - నాలుగు
వెన్న - 100 గ్రా
ఉల్లి పాయలు - రెండు
పచ్చిమిర్చి - రెండు
అల్లం వెల్లుల్లి పేస్ట్‌ - రెండు స్పూన్లు
టొమాటోలు - రెండు
గరం మసాలా - ఒక స్పూను
జీలకర్ర - ఒక స్పూను
పావు బాజీ మసాలా - ఒక స్పూను
క్యారెట్‌, క్యాప్సికమ్‌ - ఒక్కొక్కటి చొప్పున
కొత్తిమీర తురుము - కొద్దిగా
ఉప్పు - తగినంత
నిమ్మకాయలు - రెండు
ఆరెంజ్‌ కలర్‌ - కొద్దిగా
తయారీ విధానం
ముందుగా ప్రెషర్‌ పాన్‌లో నూనె వేసి జీలకర్ర వేసి, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్ట్‌ వేసి వేగాక ఉప్పు, కారం పావ్‌ బాజీ మసాలా వేసి కలపాలి. ఇప్పుడు టొమాటో ముక్కలూ, క్యారెట్‌ ,క్యాప్సికమ్‌ ముక్కలు కూడా వేసి చికెన్‌ ఖీమా వేసి బాగా ఉడికినాక కొత్తిమీర తురుము కూడా వేసి మూత పెట్టేయ్యాలి. ఇప్పుడు పావ్‌ బాజీ బ్రెడ్‌లను ఒక పెనం మీద వెన్న వేసి రెండు వైపులా కాల్చి, వాటిని మధ్యలోకి కట్‌ చేసి దాని మధ్యలో పైన చేసిన ఖీమా కర్రీని స్టఫ్‌ చేసుకుంటే ఘుమఘుమలాడే చికెన్‌ ఖీమా పావ్‌బాజీ రెడీ.


 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com