అరబ్‌ సోషల్‌ మీడియా ఇన్‌ఫ్యుయెన్సర్స్‌ సమ్మిట్‌ దుబాయ్‌లో

- September 20, 2016 , by Maagulf
అరబ్‌ సోషల్‌ మీడియా ఇన్‌ఫ్యుయెన్సర్స్‌ సమ్మిట్‌ దుబాయ్‌లో

దుబాయ్‌: వైస్‌ ప్రెసిడెంట్‌, ప్రైమ్‌ మినిస్టర్‌ ఆఫ్‌ ది యూఏఈ, దుబాయ్‌ రూలర్‌ షేక్‌ మొహమ్మద్‌ బిన్‌ రషీద్‌ అల్‌ మక్తౌమ్‌ డైరెక్షన్‌లో దుబాయ్‌ ప్రెస్‌ క్లబ్‌, రెండవ అరబ్‌ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్స్‌ సమ్మిట్‌ (ఎఎస్‌ంఐఎస్‌)ని నిర్వహించనుంది. రీజినల్‌ అలాగే ఇంటర్నేషనల్‌ సోషల్‌ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్స్‌ మరియు ఎక్స్‌పర్ట్స్‌ని ఆకర్షించేలా దేబాయ్‌ వరల్డ్‌ ట్రేడ్‌ సెంటర్‌ వద్ద డిసెంబర్‌ 6 నుంచి 7 వరకు ఈ ఈవెంట్‌ జరగనుంది. దుబాయ్‌ ప్రెస్‌ క్లబ్‌ ప్రెసిడెంట్‌ మరియు ఛైర్‌ పర్సన్‌ - ఆర్గనైజింగ్‌ కమిటీ మోనా అల్‌ మర్రి మాట్లాడుతూ, షేక్‌ మొహమ్మద్‌ డైరెక్షన్‌లో ఈ ఈవెంట్‌ నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. అరబ్‌ సొసైటీకి కమ్యూనికేషన్‌ మీడియం ద్వారా మెరుగైన సేవలు అందించేందుకోసం, విప్లవాత్మకమైన మార్పులు తెచ్చేందుకోసం ఈ ఈవెంట్‌ ఉపయోగపడ్తుందని ఆయన అభిప్రాయపడ్డారు. తొలి ఎడిషన్‌ అరబ్‌ సోషల్‌ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్స్‌ మార్చ్‌ 2015లో జరిగింది. 2500 పార్టిసిపెంట్స్‌, 38 ఎక్స్‌పర్ట్స్‌ ఈ ఈవెంట్‌లో పాల్గొన్నారు. 37 మందికి అరబ్‌ సోషల్‌ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్స్‌ అవార్డ్‌ని ఆ సీజన్‌లో అందించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com