పోస్ట్ ఆఫీసుల్లో బిల్లుల చెల్లింపులు
- September 21, 2016
అబుదాబీ: పోస్ట్ ఆఫీసుల్లో రెసిడెంట్స్ తమ బిల్లుల్ని చెల్లించేందుకు మార్గం సుగమం అయ్యింది. ఎమిరేట్స్ పోస్ట్ గ్రూప్‌కి చెందిన పోస్ట్ ఆఫీసుల్లో ఈ మేరకు సౌకర్యాల్ని కల్పించారు. అబుదాబీ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ (ఎడిడిసి) బిల్లుల్ని కూడా ఇక్కడ చెల్లించవచ్చు. అబుదాబీ వాటర్ అండ్ ఎలక్ట్రిసిటీ అథారిటీ (ఎడిడబ్ల్యుఇఎ)కి చెందిన ఎడిడిసి పోస్ట్ ఆఫీసుల్లో బిల్లుల్ని వసూలు చేసేందుకు తగిన ఏర్పాట్లు చేసింది. వినియోగదారులు, ఏదైనా పోస్ట్ ఆఫీస్‌ని వినియోగించి, తమ బిల్లు లేదా అకౌంట్ నెంబర్ని తెలిపి, బిల్లుల్ని చెల్లించవచ్చు. డిస్కనెక్షన్ల విషయంలో అయితే బిల్లుల్ని పోస్ట్ ఆఫీసుల్లో చెల్లించి, డిస్కనెక్షన్ వివరాల్ని తెలిపితే, వీలైనంత త్వరగా రికనెక్షన్ చేస్తారు. ఎమిరేట్స్ పోస్ట్ గ్రూప్ సిసో ఇబ్రహీమ్ బిన్ కరమ్ మాట్లాడుతూ, వినియోగదారులకు మెరుగైన సౌకర్యాల్ని నఅందించడంలో భాగంగానే ఈ కార్యక్రమాన్ని చేపట్టామని అన్నారు. బ్రాంచ్‌ల సమయాలు, బిల్లు చెల్లింపు సమయాల్ని తెలుసుకునేందుకు తమ వెబ్‌సైట్‌ని సందర్శించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
తాజా వార్తలు
- మామిడి రసం తాగి 400 మందికి ఫుడ్ పాయిజన్.. 60 మంది పరిస్థితి విషమం!
- ఏపీ ప్రజలకు బిగ్ అలర్ట్..
- తెలంగాణ భవన్లో కేసీఆర్ కీలక సమావేశం
- తెలంగాణలో బస్సులు బంద్ ..ప్రభుత్వం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు !
- రియాద్ లో ఘనంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జన్మదిన వేడుకలు
- హాంకాంగ్‌లో ఘనంగా ఉగాది వేడుకలు
- దుబాయ్ ఎయిర్పోర్ట్ ని సందర్శించిన క్రౌన్ ప్రిన్స్ షేక్ హమ్దాన్
- తమిళనాడులో ముగిసిన ఎన్నికల ప్రచారం
- ఘనంగా గురూజీ రామ్ రతన్ జీ జయంతి వేడుకలు
- బాణసంచా ఫ్యాక్టరీలో పేలుడు..ఆరుగురు మృతి..









