అజయ్ దేవగన్ ముద్దు వ్యవహారం పై ట్వీట్ చేసిన అమితాబ్
- September 21, 2016
బాలీవుడ్ నటుడు అజయ్‌దేవగణ్ తన 25 ఏళ్ల సినీ ప్రస్థానంలో ఎప్పుడూ చేయని పనిని చేశారని, ఇంతవరకూ ఆన్‌స్క్రీన్‌పై ఏ నటిని ముద్దుపెట్టుకోని ఆయన 'శివాయ్' కోసం ఆ పనిచేశారని వార్తలు రాశారు. ఇటీవల విడుదలైన ఈ చిత్ర పోస్టర్లు, టీజర్‌ను చూసిఇలా చెప్పుకొచ్చారు. అయితే ఇది నిజం కాదని బాలీవుడ్ షెహెన్షా అమితాబ్ బచ్చన్ ట్విట్టర్ ద్వారా సమాధానం ఇచ్చారు. ఓ మీడియా రాసిన ఈ వార్తకు అమితాబ్ రిప్లై ఇచ్చారు. 'తప్పు.. ప్రకాశ్ ఝా తెరకెక్కించిన 'సత్యాగ్రహ్' చిత్రంలో అజయ్ కిస్ చేశారు' అని ట్వీట్ చేశారు. అజయ్ ఈ చిత్రంలో నటిస్తూ స్వీయ దర్శకత్వంలో నిర్మిస్తున్నారు. సాయేషా సైగల్ చిత్రంలో కథానాయిక పాత్రను పోషిస్తున్నారు. భారీ బడ్జెట్‌తో రూపొందిస్తున్న ఈ చిత్రం అక్టోబరు 28న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రం ట్రైలర్‌కు మంచి స్పందన వచ్చిన సంగతి తెలిసిందే.
తాజా వార్తలు
- IPL 2026: గుజరాత్ పై ముంబై ఘన విజయం
- నటుడు జగపతిబాబు చేతుల మీదగా రామ్ కొణికి సరికొత్త 'కొణికి లక్స్' స్కిన్ కేర్ ప్రారంభం
- మే 1 నుంచి తిరుమలలో శ్రీవారి దర్శనానికి కొత్త నిబంధనలు
- JEE మెయిన్స్ తుది ఫలితాలు వచ్చేశాయ్..
- ఏపీకి కేంద్ర ప్రభుత్వం గొప్ప శుభవార్త
- కాంగ్రెస్ ప్రభుత్వంకు కేసీఆర్ డెడ్‌లైన్
- కరీంనగర్లో ఘనంగా 'కార్తికేయ జువెలరీస్' ప్రారంభోత్సవం
- యూఏఈలో ఉగ్రవాద సంస్థ భగ్నం: దేశ భద్రతను దెబ్బతీయాలన్న కుట్ర విఫలం
- బహ్లా కోటలో నాలుగు కొత్త మ్యూజియమ్స్ ప్రారంభం..!!
- ఖతార్ మున్సిపాలిటీలో ఈకో ఫ్రెండ్లీ వెహికల్స్, పరికరాలు..!!









