100 మిలియన్ల కస్టమర్లను నమోదుచేసుకున్న ఫ్లిప్ కార్ట్
- September 21, 2016
దేశీయ ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్ కార్ట్ మరో మైలురాయిని అధిగమించింది. వంద మిలియన్ కస్టమర్ యూజర్లను తమ ఫ్లాట్ ఫామ్ పై నమోదుచేసుకున్నట్టు ఫ్లిప్ కార్ట్ బుధవారం ప్రకటించింది. ఈ మైలురాయిని తాకిన మొదటి ఆన్ లైన్ మార్కెట్ ప్లేస్ గా ఫ్లిప్ కార్ట్ నిలిచినట్టు ఈ కంపెనీ బుధవారం పేర్కొంది. 2016 మార్చిలో 75 మిలియన్ రిజిస్ట్రర్ యూజర్ల స్థాయిని తాకిన తర్వాత ఆరు నెలల వ్యవధిలో ఈ ల్యాండ్ మార్కును క్రాస్ చేసినట్టు ఫ్లిప్ కార్ట్ వెల్లడించింది. ప్రస్తుతం మొత్తం 100 మిలియన్ల రిజిస్ట్రర్ కస్టమర్ యూజర్లను తమ ఫ్లాట్ ఫామ్ కలిగిఉన్నట్టు ఫ్లిప్ కార్ట్ తెలిపింది. భారత్ లో వైర్ లెస్, వైర్ లైన్ బ్రాండ్ బ్యాండ్ యూజర్లలో రిజిస్ట్రర్ కస్టమర్ బేస్ మొత్తం 63 శాతం ఉన్నట్టు కంపెనీ ఓ ప్రకటనలో పేర్కొంది. నాణ్యత కలిగిన ఉత్పత్తులను అందించడంలో తమ ప్లాట్ ఫామ్ అన్ని ప్రయత్నాలు చేస్తుందని, ఈ కృషే మిలియన్ల భారతీయ యూజర్లను ఆన్ లైన్ షాపింగ్ చేయడానికి దోహదం చేస్తున్నట్టు ఫ్లిప్ కార్ట్ సీఈవో, సహా వ్యవస్థాపకుడు బిని బన్సాల్ తెలిపారు. తమ ఫ్లాట్ ఫామ్ పైకి ఎక్కువగా కస్టమర్లను ఆకర్షించడానికి కూడా క్వాలిటీ ప్రొడక్ట్స్ ఎక్కువగా తోడ్పడుతున్నట్టు చెప్పారు.
తాజా వార్తలు
- మే 1 నుంచి తిరుమలలో శ్రీవారి దర్శనానికి కొత్త నిబంధనలు
- JEE మెయిన్స్ తుది ఫలితాలు వచ్చేశాయ్..
- ఏపీకి కేంద్ర ప్రభుత్వం గొప్ప శుభవార్త
- కాంగ్రెస్ ప్రభుత్వంకు కేసీఆర్ డెడ్లైన్
- కరీంనగర్లో ఘనంగా 'కార్తికేయ జువెలరీస్' ప్రారంభోత్సవం
- యూఏఈలో ఉగ్రవాద సంస్థ భగ్నం: దేశ భద్రతను దెబ్బతీయాలన్న కుట్ర విఫలం
- బహ్లా కోటలో నాలుగు కొత్త మ్యూజియమ్స్ ప్రారంభం..!!
- ఖతార్ మున్సిపాలిటీలో ఈకో ఫ్రెండ్లీ వెహికల్స్, పరికరాలు..!!
- ప్రవాసుల బ్యాంకు ఖాతాలపై కువైట్ పర్యవేక్షణ కఠినతరం..!!
- ఇండియన్ స్కూల్ బహ్రెయిన్ పై పేరెంట్స్ ప్యానెల్ విమర్శలు..!!









