మధ్యాహ్న విరామ చట్టాన్ని అతిక్రమించిన 30 యు. ఏ. ఈ. కంపెనీలు

- August 10, 2015 , by Maagulf
మధ్యాహ్న విరామ చట్టాన్ని అతిక్రమించిన 30 యు. ఏ. ఈ. కంపెనీలు


మధ్యాహ్న విరామ చట్టాన్ని అతిక్రమించిన 30 యు. ఏ. ఈ. కంపెనీలు అతిక్రమించినట్టు ఆ దేశ కార్మికశాఖ వారు ఆదివారం ప్రకటించారు. ఈ చట్టం ప్రకారం, జూన్ 15 నుండి సెప్టెంబర్ 15 వరకూ  మధ్యాహ్నం 12.30 నుండి 3 గంటలవరకు శ్రామికులతో పనిచేయించకూడదన్న సంగతి విదితమే. అంతేకాకూడా, యాజమాన్యం పనిగంటలు 8 కంటే ఎక్కువ ఉండకుండా, అదనపు పనిగంటలకు ఓవర్ టైమ్ చెల్లించేలా, నిషేధిత వ్యవధిలో పనిచేయడం అత్యవసరమైతే, శ్రామికులకు చల్లని నీరు, రక్షక పరికరాలు, ఉప్పు, నిమ్మ మరియు ఫ్రెష్ సలడ్లు అందుబాటులో ఉంచాలని కూడా ఈ చట్టం తెలియజేస్తోంది. ఈ సంవత్సరం సదరు శాఖ ఇనస్పెక్టర్లు 27,000 పైగా ఫీల్డ్ పర్యవేక్షణలను చేపట్టారు. గతంతో పోలిస్తే ఈ విధమైన అతిక్రమణలు కాస్త తగ్గుముఖం పట్టినట్టు వారు తెలిపారు.


--సి.శ్రీ(దుబాయ్)

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com