అక్రమ భవనాలు, కట్టడాలను కూల్చేయండి ...కేటీఆర్
- September 26, 2016
రాష్ట్రంలోని అన్ని మునిసిపాలిటీల్లో చెరువులు, నాలాలపై ఉన్న అక్రమ భవనాలు, కట్టడాలను కూల్చి వేయాలని మున్సిపల్, పట్టణాభివృద్ధి మంత్రి కె.తారకరామారావు ఆదేశించారు. ఇటీవలి వర్షాలు, వరదల పరిస్థితులను ఆయన సోమవారం సమీక్షించారు.
సచివాలయం నుంచి వీడియో కాన్ఫరెన ్స ద్వారా మున్సిపల్ కమిషనర్లతో మాట్లాడారు. పలు పట్టణాలను వరదనీరు ముంచెత్తడానికి దారి తీసిన కారణాలు గుర్తించాలని నిర్దేశించారు. అన్ని చెరువులు, నాలాల మ్యాప్ సేకరించి, వాటిపై అక్రమ కట్టడాలు గుర్తించాలని కోరారు. నాలాలను కబ్జా చేసిన వారు ఎంతటి వారైనా సరే వదిలి పెట్టవద్దని, అక్రమ కట్టడాలు కూల్చి వేయాలని ఆదేశించారు. కూల్చివేతల్లో పేదలను కాకుండా, వాణిజ్య అవసరాల కోసం జరిగిన నిర్మాణాలను టార్గెట్ చేయాలని ఆదేశించారు. కుదించుకుపోయిన నాలాలను వెడల్పు చేయాలని, ఇందుకోసం రెవెన్యూ, సాగునీటి శాఖల అధికారులతో జాయింట్ వర్కింగ్ గ్రూపులు ఏర్పాటు చేయాలని నిర్దేశించారు. పట్టణాల్లో శిథిలావస్థకు చేరిన భవనాలు గుర్తించి కూల్చేయాలని ఆదేశించారు. వర్షాల వల్ల ఎలాంటి ప్రాణనష్టం జరగ కుండా చూడాలన్నారు. ఎక్కడైనా అలా ప్రాణన ష్టం జరిగితే కమిషన ర్ను బాధ్యులను చేస్తామని హెచ్చరించారు. ఎన్నిసార్లు చెప్పినా విధి నిర్వహణలో అలక్ష్యం ప్రదర్శిస్తున్నారని కొందరు కమిషనర్లపై మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. పనితీరు మార్చుకోకపోతే వారం రోజుల్లో చర్య తీసుకుంటామని, ఇదే చివరి అవకాశమని హెచ్చరించారు. ప్రభుత్వ ఆదేశాలు పాటించక పోయినా, బాధ్యతల నిర్వహణలో అలక్ష్యం ప్రదర్శించినా విధుల నుంచి తొలగించడం ఖాయమని స్పష్టం చేశారు. అలాంటి వారి జాబితా సిద్ధం చేయాలని మున్సిపల్ డైరెక్టర్‌ను కేటీఆర్ ఆదేశించారు. ఇకపై వీడియో కాన్ఫరెన్స్‌ల ద్వారా నిరంతరం పర్యవేక్షిస్తామని, ఇందుకోసం మున్సిపాలిటీలలో వారం రోజుల్లో ఆ ఏర్పాట్లు చేయాలని నిర్దేశించారు. భారీ వర్షాల నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని, ధ్వంసమైన రహదారులు, ఇతర మౌలిక వసతులకు వెంటనే మరమ్మతులు చేపట్టాలని మంత్రి కేటీఆర్ సూచించారు. కమాండ్ కంట్రోల్ సెంటర్ ప్రారంభం జలమండలిలో కొత్తగా ఏర్పాటు చేసిన కమాండ్ కంట్రోల్ సెంటర్‌ను మంత్రి కేటీఆర్ సోమవారం ప్రారంభించారు. అనంతరం బోర్డు అధికారులతో సమీక్ష జరిపారు. సీవరేజి పైపులైన్ల పరిస్థితి, వాటర్ మీటర్ల ఏర్పాటుకు చేపట్టాల్సిన చర్యలను చర్చించారు. పైపులైన్ల లీకేజీలు గుర్తించేందుకు సెన్సార్ల ఏర్పాటు సాధ్యాసాధ్యాలు పరిశీలించాలని కోరారు. సీవరేజ్ పైప్లైన్ల పటిష్ఠతను కన్సల్టెన్సీతో అధ్యయనం చేయించాలని మంత్రి ఆదేశించారు.
తాజా వార్తలు
- IPL 2026: గుజరాత్ పై ముంబై ఘన విజయం
- నటుడు జగపతిబాబు చేతుల మీదగా రామ్ కొణికి సరికొత్త 'కొణికి లక్స్' స్కిన్ కేర్ ప్రారంభం
- మే 1 నుంచి తిరుమలలో శ్రీవారి దర్శనానికి కొత్త నిబంధనలు
- JEE మెయిన్స్ తుది ఫలితాలు వచ్చేశాయ్..
- ఏపీకి కేంద్ర ప్రభుత్వం గొప్ప శుభవార్త
- కాంగ్రెస్ ప్రభుత్వంకు కేసీఆర్ డెడ్‌లైన్
- కరీంనగర్లో ఘనంగా 'కార్తికేయ జువెలరీస్' ప్రారంభోత్సవం
- యూఏఈలో ఉగ్రవాద సంస్థ భగ్నం: దేశ భద్రతను దెబ్బతీయాలన్న కుట్ర విఫలం
- బహ్లా కోటలో నాలుగు కొత్త మ్యూజియమ్స్ ప్రారంభం..!!
- ఖతార్ మున్సిపాలిటీలో ఈకో ఫ్రెండ్లీ వెహికల్స్, పరికరాలు..!!









