ఉగ్రవాదానికి ఊతమిస్తున్న డ్రగ్‌ ట్రేడ్‌

- September 27, 2016 , by Maagulf
ఉగ్రవాదానికి ఊతమిస్తున్న డ్రగ్‌ ట్రేడ్‌

దుబాయ్‌: ప్రపంచానికి పెను సవాల్‌గా ఉగ్రవాదం మారిపోయింది. ఉగ్రవాదులకు నిధులు ఎక్కడి నుంచి వస్తున్నాయి? అనే విషయమై భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. అయితే ఉగ్రవాదం డ్రగ్‌ ట్రేడ్‌ ద్వారా ఆర్థికంగా బలోపేతమవుతోందని యునైటెడ్‌ నేషన్స్‌ ఆఫీస్‌ ఆణ్‌ డ్రగ్స్‌ అండ్‌ క్రైమ్‌ (యుఎన్‌ఓడిసి) అభిప్రాయపడింది. నిషేధిత ఉత్ప్రేరకాల్ని, మాదక ద్రవ్యాల్ని (డ్రగ్స్‌) ఎప్పటికప్పుడు అడ్డుకునేందుకు ప్రయత్నిస్తున్నప్పటికీ, వాటికి అడ్డుకట్ట వేయడం సాధ్యం కావడంలేదని 12వ హెమాయా ఇంటర్నేషనల్‌ ఫోరమ్‌ ఆన్‌డ్రగ్‌ ఇష్యూస్‌ వేదికపై వక్తలు అభిప్రాయపడ్డారు. దుబాయ్‌ పోలీస్‌ ఈ కార్యక్రమాన్ని నిర్వహించింది. దుబాయ్‌ పోలీస్‌ చీఫ్‌ లెఫ్టినెంట్‌ జనరల్‌ ఖామిస్‌ మట్టర్‌ అల్‌ మెజానా మాట్లాడుతూ, డ్రగ్స్‌ సరఫరాని అడ్డుకోవడంలో సరికొత్త టెక్నాలజీని సైతం వినియోగిస్తున్నామని తెలిపారు. డ్రగ్స్‌ని నిలువరించే క్రమంలో కేసులు పెరుగుతున్నాయనీ, సీజ్‌ అవుతున్న డ్రగ్స్‌ మొత్తం పెరుగుతోందనీ ఆయన వివరించగా, అదే సమయంలో పట్టుబడ్డ డ్రగ్స్‌, తయారవుతున్న డ్రగ్స్‌లో 10 శాతం కూడా ఉండటంలేదన్న అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. ఈ అభిప్రాయాలతో అందరూ ఏకాభవించక తప్పని పరిస్థితి ఉంది. ప్రపంచమంతా ఒక్కతాటిపైకి వచ్చి డ్రగ్స్‌ వ్యాప్తిని నిరోధించేందుకు చర్యలు తీసుకోవాలని ప్రతినిథులు తీర్మానించారు. రా-మెటీరియల్‌పై ముందుగా నిషేధం విధించడం, వాటిని డ్రగ్స్‌గా మార్చే కేంద్రాలపై ఉక్కుపాదం మోపడం, వీటితోపాటు డ్రగ్స్‌కి వ్యతిరేకంగా యువతలో చైతన్యం పెంచడం వంటి చర్యలు చేపట్టాలని సమావేశంలో ఈర్మానించడం జరిగింది. అరబ్‌ దేశాలు డ్రగ్స్‌ రవాణాకి కేంద్రంగా మారిపోవడం శోచనీయమని పలువురు వక్తలు అభిప్రాయపడ్డారు. గణాంకాలు స్పష్టంగా కన్పిస్తుండడంతో ఎవరూ దీన్ని ఖండించలేకపోతున్నారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com