లోభితనపు నక్క
- August 13, 2015
ఒక ఊరిలో ఒక వేటగాడు ఉండేవాడు. వాడు ప్రతిరోజూ అడవికి వెళ్లి జంతువులను వేటాడి వచ్చి వాటిని అమ్ముకుని జీవనం సాగించేవాడు. అలాగే ఒకరోజు వేటకు బయలుదేరిన వేటగాడికి దారిలో ఒక లేడి కనబడింది. గురి చూసి దాని మీదకి విల్లు ఎక్కుపెట్టాడు. అంతే ఆ లేడి బాణం దెబ్బకి కుప్పకూలిపోయింది. దాన్ని చూసి వేటగాడు సంతోషించి ఈ మాంసాన్ని ఊరిలో అమ్మితే బోలెడన్ని డబ్బులు వస్తాయి అనుకుని దాన్ని భుజాన వేసుకుని బయలుదేరాడు. దారిలో ఒక అడవి పంది కన్పించింది. అది మంచిగా కొవ్వు పట్టి ఉంది. దాన్ని చూసి వేటగాడికి ఆశ కలిగింది. దానికి విల్లు గురి పెట్టగా గురి తప్పి పంది వేటగాడి మీదకి దూకింది. వారిద్దరి మధ్య పెద్ద యుద్ధమే జరిగింది. ఇంతలో వీళ్లిద్దరి హడావిడికి పక్కనే ఉన్న పాము ఒకటి పంది కాలి కింద పడి చచ్చిపోయింది. కొంత సేపటికి పంది వేటగాడ్ని చంపి అది కూడా చచ్చిపోయింది. ఇంతలో అటువైపుగా వస్తున్న నక్క ఒకటి చచ్చి పడి ఉన్న వేటగాడ్ని, పామునీ, లేడినీ చూసి అబ్బా నాకెంత అదృష్టం దక్కింది. నాకు రెండు మూడు నెలలకి సరిపడా ఆహారం ఒక్కచోటే దొరికింది అనుకుని ఆ మాంసాన్ని మొత్తాన్ని తన గుహలోకి మోసుకెళ్లి, ముందు వేసుకుని కూర్చొని ముందుగా ఏది తినాలో తెలియక.. ఈ రోజుకి ఈ వింటి నారితో సరిపెట్టుకుంటాను అనుకుని వింటికున్న నారిని గట్టిగా తన పళ్లతోటి కొరికింది. నారి తెగి విల్లు విరిగి దాని డొక్కలో గుచ్చుకుని దెబ్బకి అక్కడక్కడే చచ్చిపోయింది.
తాజా వార్తలు
- చర్చలు విఫలమైతే బాంబులే.. ట్రంప్ హెచ్చరిక
- ఇరాన్‌తో మునుపటి సంబంధాలు అసాధ్యం..!!
- డిఫెన్స్ ఫోర్స్ సన్నద్ధతను సమీక్షించిన కింగ్ హమద్ ..!!
- 1200 ఫ్లైట్స్ నడుపుతున్న జజీరా ఎయిర్వేస్..!!
- సౌదీ అరేబియాలో 1.6% తగ్గిన ప్రాపర్టీ ధరలు..!!
- బర్కాలో ఆసియా దేశస్థుడు అరెస్టు..!!
- ఖతార్‌కు విదేశీ విమానయాన సంస్థల సేవలు పునరుద్ధరణ..!!
- IPL 2026: గుజరాత్ పై ముంబై ఘన విజయం
- నటుడు జగపతిబాబు చేతుల మీదగా రామ్ కొణికి సరికొత్త 'కొణికి లక్స్' స్కిన్ కేర్ ప్రారంభం
- మే 1 నుంచి తిరుమలలో శ్రీవారి దర్శనానికి కొత్త నిబంధనలు









