అక్రమ కట్టడాలు కూల్చివేత ఎవరుచెప్పిన ఆగవు - కేటీఆర్
- September 30, 2016
మా పార్టీకి చెందిన కార్పోరేటర్లు, ఎమ్మెల్యేలు, మంత్రులు.. చివరకు మున్సిపల్ మంత్రిగా తాను, ఇంకా చెప్పాలంటే విపక్షాలు అడ్డుకున్నా సరే అక్రమ కట్టడాల కూల్చివేతలు ఆగవని తెలంగాణ రాష్ట్ర మంత్రి కల్వకుంట్ల తారక రామారావు చెప్పారు.
ఎవరు ఆపినా, ఎవరు అడ్డుకున్నా తాము పట్టించుకోమని చెప్పారు. అన్నీ కూల్చేస్తామన్నారు. తాము పేదవారి గుడిసెలు కూల్చడం లేదని, నాలాల పైన అక్రమ నిర్మాణాలనే లక్ష్యంగా చేసుకున్నామని తెలిపారు. పేదల ఇళ్లు కూల్చవలసి వస్తే వారికి డబుల్ బెడ్ రూం ఇళ్లు ఇస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్పారని గుర్తు చేశారు.
చెరువుల రక్షణకు ఆధునిక టెక్నాలజీ చెరువులకు జియో ఫెన్సిక్ చేస్తున్నామని, ఎవరైనా ఆక్రమిస్తే అధికారులకు సంక్షిప్త సమాచారం అందుతుందన్నారు. తాను కేబినెట్ మంత్రిని అని, అందులోను ముఖ్యమంత్రి కొడుకుని అని, అయినా పక్షపాతం లేదన్నారు.
శాస్త్రీయంగా కొత్త జిల్లాల ఏర్పాటులో సిరిసిల్లకు చోటు కల్పించలేదని చెప్పారు. సిరిసిల్లలో కలపడానికి 9 మండలాలు మాత్రమే అనుకూలంగా ఉన్నాయని, అదీ కాక 5 లక్షల జనాభా మాత్రమే సిరిసిల్లకు అనుకూలంగా ఉందని చెప్పారు. తాను జిల్లా కోసం ప్రతిపాదించినప్పటికీ శాస్త్రీయంగా సాధ్యం కాలేదన్నారు.
తాజా వార్తలు
- బహ్లా కోటలో నాలుగు కొత్త మ్యూజియమ్స్ ప్రారంభం..!!
- ఖతార్ మున్సిపాలిటీలో ఈకో ఫ్రెండ్లీ వెహికల్స్, పరికరాలు..!!
- ప్రవాసుల బ్యాంకు ఖాతాలపై కువైట్ పర్యవేక్షణ కఠినతరం..!!
- ఇండియన్ స్కూల్ బహ్రెయిన్ పై పేరెంట్స్ ప్యానెల్ విమర్శలు..!!
- అబుదాబిలో 4 దర్బ్ టోల్ గేట్ల పేర్లలో మార్పులు..!!
- ఇంధన భద్రతపై సౌదీ-భారత్ చర్చలు..!!
- హైదరాబాద్: 32 మంది బ్యాంకు అధికారుల అరెస్ట్..
- గచ్చిబౌలిలో భారీ అగ్నిప్రమాదం: 15 బైకులు దగ్ధం
- ఒమన్ గల్ఫ్‌లో ముదిరిన ఉద్రిక్తతలు
- మలేషియాలో ఘోర అగ్నిప్రమాదం..వెయ్యి ఇళ్లు దగ్ధం









