రజనీకాంత్ కూతురుదర్శకత్వంలో ఓ డాక్యుమెంటరీ..
- October 02, 2016సూపర్ స్టార్ రజనీకాంత్ కూతురుగా, హీరో ధనుష్ భార్యగా ఐశ్వర్య ధనుష్ సినీ అభిమానులకు సుపరిచితురాలే. అయితే తనకంటూ ప్రత్యేక గుర్తింపు కోసం ప్రయత్నిస్తున్న ఈ స్టార్ వారసురాలు, ప్రస్తుతం దర్శకురాలిగా నిలదొక్కుకునేందుకు కష్టపడుతోంది. ఇప్పటికే ధనుష్ హీరోగా 3 సినిమాను డైరెక్ట్ చేసిన ఐశ్వర్య ఆ సినిమాతో ఆశించిన స్థాయి విజయం సాధించలేకపోయింది. ప్రస్తుతం సినిమా నేపథ్యంలో ఓ డాక్యుమెంటరీ చిత్రాన్ని రూపొందించే పనిలో బిజీగా ఉంది.సినీ రంగంలోని 24 శాఖల్లో ఒకటైన స్టంట్ డైరెక్టర్ ల కష్టాలు, వారి జీవనశైలి, వారికి ఉన్న ఇబ్బందుల నేపథ్యంలో సినిమా వీరన్ పేరుతో ఓ డాక్యుమెంటరీ చిత్రాన్ని తెరకెక్కిస్తోంది ఐశ్వర్య.తానే స్వయంగా నిర్మిస్తూ డైరెక్ట్ చేస్తున్న ఈ చిత్రానికి సూపర్ స్టార్ రజనీకాంత్ వాయిస్ ఓవర్ అంధిస్తుండగా, ఆస్కార్ విజేత ఏఆర్ రెహమాన్ నేపథ్యం సంగీతం అందిస్తున్నాడు. త్వరలో రిలీజ్ చేయనున్న ఈ డాక్యుమెంటరీని కేంద్ర ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాండ్ కాస్టింగ్ మినిస్టర్ వెంకయ్య నాయుడుకు చూపించిన ఐశ్వర్య, ఇన్నాళ్లుగా జాతీయ అవార్డుల్లో ఫైట్ మాస్టర్ క్యాటగిరీ లేకపోవటంపై విచారం వ్యక్తం చేశారు. ఈ ఏడాది నుంచి ఫైట్ మాస్టర్లకు కూడా జాతీయ అవార్డును అందించాలని కేంద్రాన్ని కోరారు.
తాజా వార్తలు
- విదేశీ పర్యటనకు చంద్రబాబు
- షెడ్యూల్ కంటే ముందే మెట్రో స్టేషన్లు పునర్ ప్రారంభం
- జిలీబ్లో లిక్కర్ ఫ్యాక్టరీ సీజ్
- దుబాయ్ ఫ్లీ మార్కెట్ గురించి తెలుసా?
- మడా కార్డ్ మోసాల ఫిర్యాదుకు ఆన్లైన్ సేవ ప్రారంభం
- మహిళలు,వృద్ధుల సాధికారతకు ఒమన్ కృషి
- ఖతార్ ప్రెసిషన్ హెల్త్ ఇన్స్టిట్యూట్ కొత్త రికార్డు
- యాదాద్రి భక్తులకు డ్రెస్ కోడ్.. జూన్ 1 నుంచి అమల్లోకి..
- భారీగా పెరిగిన బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ దంపతుల ఆస్తులు
- ఆదాయం పెంపు పై దృష్టి పెట్టిన సీఎం రేవంత్ రెడ్డి..