సంక్రాంతి కానుకగా 'ఖైదీ నంబరు 150'..

- October 03, 2016 , by Maagulf
సంక్రాంతి కానుకగా 'ఖైదీ నంబరు 150'..

మెగాస్టార్‌ చిరంజీవి కథానాయకుడిగా నటిస్తున్న 'ఖైదీ నంబరు 150' చిత్రం సంక్రాంతి కానుకగా జనవరిలో విడుదల కాబోతోంది. చిత్ర నిర్మాణ సంస్థ కొణిదెల ప్రొడక్షన్‌ కంపెనీ సోషల్‌మీడియా ద్వారా ఈ విషయాన్ని వెల్లడిస్తూ.. ఓ ప్రకటనను పోస్ట్‌ చేసింది. ఈ సందర్భంగా నిర్మాత రామ్‌చరణ్‌ మాట్లాడుతూ.. '70 శాతం పైగా చిత్రీకరణ పూర్తయింది. నాన్నగారు డబ్బింగ్‌ కూడా ప్రారంభించారు. ఇప్పటివరకూ చక్కని ఔట్‌పుట్‌ వచ్చిందన్న సంతృప్తి ఉంది. అన్ని పనులు పూర్తి చేసి, జనవరిలో సంక్రాంతి కానుకగా 'ఖైదీ నంబరు 150' చిత్రాన్ని విడుదల చేస్తున్నాం' అన్నారు.కాజల్‌ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్‌ సంగీతం సమకూరుస్తున్నారు. బాలీవుడ్‌ నటుడు తరుణ్‌ అరోరా విలన్‌ పాత్రలో నటిస్తున్నారు. రత్నవేలు ఛాయాగ్రహణం అందిస్తున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com