లుంగీల లుక్‌లో చైతూ గ్యాంగ్!
- October 03, 2016
దసరా దగ్గరపడుతోంది! పండుగ వాతావరణం అప్పుడే వచ్చేసింది! ఈ సారి సినిమాలూ దసరా రేసులో పోటాపోటీగా తలపడబోతున్నాయి. ఐదు సినిమాలు దసరా సందర్భంగా విడుదల కాబోతున్నాయి. అందులో ఒకటి నాగచైతన్య ప్రేమమ్ అని చెప్పడంలో ఏ మాత్రం సందేహం లేదు. మలయాళంలో అందరి దృష్టిని ఆకర్షించి ప్రత్యేకంగా నిలిచిన ప్రేమమ్‌కు ఈ సినిమా రీమేక్ కావడంతో తెలుగు సినీ అభిమానులూ ఈ సినిమా కోసం ఆసక్తిగా చూస్తున్నారు. ఆ సినిమా ప్రోమోలన్నీ కూడా మంచి ఫీల్నే కలిగించాయి. సినిమా విడుదల తేదీ దగ్గరపడుతుండడంతో ప్రేమమ్ టీమ్ ప్రమోషన్ల జోరును పెంచింది. ఇప్పటికే చైతూ ఇంటర్వ్యూలను మొదలెట్టేశాడు. త్వరలోనే మీడియా వారినీ కలవబోతున్నాడు. ఇక, ఎప్పటికప్పుడూ విడుదల చేస్తున్న కొత్త పోస్టర్లు మరింత ఆసక్తిని పెంచేస్తున్నాయి.
తాజాగా చైతూ అండ్ గ్యాంగ్ వైట్ అండ్ వైట్‌లో నడిచి వస్తున్న పోస్టర్‌ను విడుదల చేశారు. తెల్ల చొక్కాలు, తెల్ల లుంగీలు కట్టుకుని ఏదో చేసేద్దాం పద అన్నట్టు తరలుతోంది అతడి గ్యాంగ్. ఇక, ఇందులో చైతూ స్నేహితులుగా శ్రీనివాసరెడ్డి, చైతన్యకృష్ణ, ప్రవీణ్ కనిపిస్తారు. ఆ నలుగురు కలిసి లుంగీలు కట్టేసి కాలేజీకో..మరి ఇంకెక్కడికో బయల్దేరి పోయారు.
ఇక, నాగార్జున సోగ్గాడే చిన్నినాయనా సినిమా రిలీజ్‌కు ముందు నాగార్జున, నాగచైతన్య, అఖిల్‌లు ఇలా వైట్ అండ్ వైట్ వేసేసి కనిపించారు.
తాజా వార్తలు
- DXB, DWC లో 48 గంటల్లో 1,140 ఫ్లైట్స్..!!
- యూఏఈలో ప్రయాణికులకు ఉచిత వైద్య సహాయం..!!
- రియాద్‌కు భారీ వర్ష సూచన..!!
- ఇరాన్, GCC దేశాల నుండి ఒమానీ పౌరులు సేఫ్ రిటర్న్..!!
- ఇరాన్ క్షిపణులను అడ్డుకున్న కువైట్..!!
- బాప్కోలో అగ్నిప్రమాదం..ఇరాన్ మిస్సైల్ అటాక్?
- డిఫెన్స్ ఆపరేషన్ సెంటర్ ను సందర్శించిన డిప్యూటీ పీఎం..!!
- కర్ణాటక ప్రభుత్వం సంచలన నిర్ణయం..
- వాహనదారులకు ఊరట
- ఆస్కార్స్ 2026 ప్రజెంటర్‌గా ప్రియాంక చోప్రా









