శివకార్తికేయన్ దిల్‌రాజు చేతిలో ....

- October 04, 2016 , by Maagulf
శివకార్తికేయన్  దిల్‌రాజు చేతిలో ....

తమిళంలో శివకార్తికేయర్ హీరోగా తెరకెక్కిన చిత్రం 'రెమో'. ఈ సినిమాలో హీరో లేడీ గెటప్‌లో కనిపించనున్నాడు. కీర్తి సురేష్ కథానాయికగా నటించిన ఈ చిత్రాన్ని తెలుగులో దిల్‌రాజు లాంఛ్ చేయనున్నాడు. శివకార్తికేయన్‌ తెలుగులో కూడా మార్కెట్ సంపాదించాలని చూస్తుండగా, ఈ సినిమాను ఓ పెద్ద నిర్మాత చేతిలో పెడితేనే కరెక్ట్ అని భావించి దిల్ రాజు చేతిలో పెట్టారు. అంతేకాకుండా దీనికి హీరో నాని కూడా సహకరించాడట. నాని, శివకార్తికేయన్‌లు మంచి స్నేహితులు. మళ్లీ ఈ సినిమలో చేసిన కీర్తి సురేష్ ప్రస్తుతం దిల్‌రాజు నిర్మాణంలో నాని సరసన 'నేను లోకల్' సినిమాలో చేస్తుంది. చివరగా శివకార్తికేయన్ ఇలా దిల్‌రాజు చేతిలో పడ్డాడని అనుకుంటున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com