విలన్‌గా నటించున్న సునీల్‌

- October 04, 2016 , by Maagulf
విలన్‌గా నటించున్న సునీల్‌

''తెలుగు ఇండిస్టీలోకి విలన్‌ కావాలనుకుని వచ్చాను. ముందు మోహన్‌బాబులా కొన్ని క్యారెక్టర్స్‌తో పేరు తెచ్చుకుని, తర్వాత కోటలా చేయాలని అనుకున్నాను. కానీ కమెడియన్‌ అయిపోయాను. ఇప్పుడు హీరో అయ్యాను. నేను విలన్‌గా నటిస్తాను.. కానీ ముందు వేరే భాషా చిత్రాల్లో చేస్తాను. వచ్చే ఏడాది వేరే భాషా చిత్రాల్లో విలన్‌గా కనబడే అవకాశాలున్నాయి'' అని సునీల్‌ అన్నారు. సునీల్‌ హీరోగా వీరు పోట్ల దర్శకత్వంలో రూపొందిన చిత్రం 'ఈడు గోల్డ్‌ ఎహే'. ఏ టీవీ సమర్పణలో ఎ.కె. ఎంటర్‌టైన్‌మెంట్స్‌ ప్రై.లిమిటెడ్‌ పతాకంపై రామబ్రహ్మం సుంకర నిర్మించారు. ఈనెల 7న విడుదల కానుంది. ఈ సందర్భంగా హీరో సునీల్‌ చెప్పిన కబుర్లు...


పెళ్లి భోజనంలా... 
బాగా ఆకలిగా ఉన్నవారికి మంచి పెళ్ళి భోజనం దొరికినట్టుగా ఉంటుంది. అది సినిమాలో నటించిన ఆర్టిస్టులకైనా కావచ్చు. రేపు సినిమా చూసే ఆడియెన్స్‌ అయినా కావచ్చు.
ఎవరూ ఎక్స్‌పెక్ట్‌ చేయలేరు 
నా కెరీర్‌లో నేను హీరోగా చేసిన అందాల రాముడు, పూలరంగడు, భీమవరం బుల్లోడు, జక్కన్న.. ఈ సినిమాలన్నీ కమర్షియల్‌ సినిమాలు. నాకు మంచి విజయాన్ని సాధించి పెట్టాయి కూడా. ఈ సినిమాలు చూస్తున్నప్పుడు తర్వాత వచ్చే సన్నివేశాలను ముందుగానే ప్రేక్షకుడు ఉహించేస్తాడు. కానీ 'ఈడు గోల్డ్‌ ఎహే' గతంలో నేను చేసిన 'మర్యాదరామన్న' సినిమా తరహాలో ఓ ఎగ్జయిట్‌మెంట్‌తో సాగే చిత్రం. ఈ సినిమా నేను చేయడానికి ప్రధాన కారణం దర్శకుడు వీరుపోట్ల. సినిమా చూస్తున్నంత సేపూ చాలా థ్రిల్లింగ్‌గా ఉంటుంది. 
మంచి స్నేహితులు 
నేను, త్రివిక్రమ్‌ ఒక రూమ్‌లో ఉన్నరోజుల్లో వీరుపోట్ల, గోపీమోహన్‌ అందరం ఫ్రెండ్స్‌. ఆ సమయంలో వీరుపోట్లకు రూమ్‌ కూడా నేనే చూసి పెట్టాను. అప్పటి నుంచి మా మధ్య పరిచయం ఉంది. త్రివిక్రమ్‌ దర్శకుడయ్యాక నాకు బ్రేక్‌ ఇస్తే ఇప్పుడు వీరుపోట్ల మరో మంచి బ్రేక్‌ ఇవ్వబోతున్నాడు. వీరు చాలా టాలెంటెడ్‌ డైరెక్టర్‌. ప్రతి ఫ్రేమ్‌లో కామెడీ మిస్‌ కాకుండా చూసుకున్నాడు. ఈ సినిమాకు సంబంధించిన రిస్క్‌ అంతా తనే తీసుకున్నాడు.
డబుల్‌ షేడ్స్‌ ఉన్న పాత్ర 
ఇందులో నా క్యారెక్టర్‌ పేరు బంగార్రాజు. ఫ్యామిలీ ఎంటర్‌ టైనర్‌ అండ్‌ థ్రిల్లర్‌ కాన్సెప్ట్‌. ఇందులో డబుల్‌ షేడ్‌ ఉన్న రోల్‌ పోషించాను. నేను ఇప్పటి వరకు చేయని యాంగిల్‌ను ఈ సినిమాలో చూడబోతున్నారు. వీరుపోట్ల ఈ కథను నన్ను దష్టిలో పెట్టుకునే రాసుకున్నాడు. ఈ కథ నాకే కాదు ఎవరికైనా సూట్‌ అవుతుంది. మర్యాదరామన్న సినిమా లాంటి అభినందనలు ఈ సినిమాకూ వస్తాయి.
అందుకే మాస్క్‌ 
ఇందులో మాస్క్‌ వేసుకుని కనిపించడానికి కారణం కొన్ని సమస్యల నుండి తప్పించుకుని తిరగడానికే తప్ప రాబిన్‌ హుడ్‌ తరహా పాత్రలో కనపడను. సినిమాలో అన్నీ రకాల ఎలిమెంట్స్‌ ఉంటాయి. ముఖ్యంగా ఈ సినిమాను చిన్నపిల్లలు బాగా ఇష్టపడతారు.
అది అందరికీ సాధ్యం కాదు 
కమర్షియల్‌ సినిమాలంటే ఓ ఫార్మేట్‌ ఉంటుంది. ఆ ఫార్మేట్‌ అందరికీ తెలుసుంటుంది. అలాంటి ఫార్మేట్స్‌ లో సినిమాలు చేయడం అందరికీ కుదరదు.
ఆయనే ఇన్‌స్పిరేషన్‌ 
చిరంజీవే నాకు స్ఫూర్తి. ఆయన 150వ సినిమాలో యాక్ట్‌ చేయమని అడిగారు. అప్పటికే 'ఈడు గోల్డ్‌ ఎహే' సినిమాకు డేట్స్‌ ఇచ్చేసి ఉండటం వల్ల కుదరలేదు. చిరంజీవి సినిమాలో నేను యాక్ట్‌ చేస్తున్నాను. నాకు ఇంతకుముందిచ్చిన రోల్‌లో కాకుండా వేరే రోల్‌ చేస్తున్నాను.
వారికి సేవ చేయాలనుంది 
వచ్చే ఏడాది ఓ ఆర్గనైజేషన్‌ ప్రారంభించి వికలాంగ చిన్నారులకు సపోర్ట్‌ చేయాలనుకుంటున్నాను. నేను స్థాపించే సంస్థలో వ్యక్తులు అంటే మానసికంగా సమస్యలు దాటి వచ్చిన వారే ఉంటారు. టీచర్స్‌ నుంచి అందులో పనిచేసే వాచ్‌మెన్‌ వరకు వారే ఉంటారు. అలా చేయడానికి కారణం వారిలోని ఉన్న నిష్కలమైన మనసే. అలాంటి కొంత మంది పిల్లలను నేను దత్తత తీసుకుని, నా స్వసంపాదనతోనే ఆర్గనైజేషన్‌ స్టార్ట్‌ చేస్తాను.
తర్వాత చిత్రాలు 
ప్రస్తుతం క్రాంతి మాధవ్‌ సినిమాలో చేస్తున్నాను. రాజేంద్రప్రసాద్‌ కామెడీ స్టయిల్‌లో సాగుతూ ఓ మెసేజ్‌ ఇచ్చే చిత్రమది. ఇప్పటి వరకు 30 శాతం చిత్రీకరణ పూర్తయింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com