దెయిరా సముద్రపాయలో మునిగిన కారు నుంచి వ్యక్తిని రక్షించిన పోలీసులు

- October 05, 2016 , by Maagulf
దెయిరా సముద్రపాయలో మునిగిన కారు నుంచి వ్యక్తిని రక్షించిన పోలీసులు

తన కారుతో సహా డెయిరి సముద్ర పాయలో మునిగిపోయి తీవ్రంగా గాయపడిన ఒక వ్యక్తిని రక్షించినట్లు  దుబాయ్ పోలీసులు మంగళవారం తెలిపారు. దుబాయ్ క్లబ్ బ్రిగేడ్ సమీపంలో మంగళవారం జరిగిన మరోక ప్రమాదంలో ఒక ట్యాంకర్ మరియు భారీ ట్రక్  షార్జా సమీపంలో ఒక దానినొకటి ఢీ కొన్నాయి. ఈ ప్రమాదంలో గాయపడిన ట్యాంకర్ డ్రైవర్ తన వాహనాన్ని వదిలి పారిపోయినట్లు పోలీసులు పేర్కొంటున్నారు. ఈ ప్రమాదంకు కారకుడైన  డ్రైవర్ వాహనం లోపల ఇరుక్కుపోయాడు. దీనితో ప్రమాదాల నుంచి రక్షించే జట్టు  హైడ్రాలిక్ యంత్రం ఉపయోగించి వాహన లోపల భాగాలను కత్తిరించి ఆ డ్రైవర్ ను కాపాడవల్సివచ్చింది. అనంతరం బాధితుడిని హెలికాఫ్టర్ ద్వారా రషీద్ హాస్పిటల్ కు తరలించారు.దుబాయ్ పోలీస్ భూ ఉపరితల రక్షక జట్టు విభాగానికి అధిపతి మేజర్ అబ్దుల్లా బిషోఆహ్ మాట్లాడుతూ , తమకు ఉదయం 9:30 గంటలకు ఒక సమాచారం అందుకున్నట్లు తెలియచేస్తూ వెనువెంటనే దుబాయ్ పోలీస్ 8 నిమిషాల్లో అక్కడకు వచ్చినట్లు చెప్పారు.దుబాయ్ సివిల్ డిఫెన్స్ జట్టు, దుబాయ్ పోలీస్ వైమానిక సిబ్బంది మరియు అంబులెన్సులు కూడా ఆ సమయంలో సమయంలో సంఘటనా స్థలానికి వచ్చాయి .

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com