దుబాయ్, షార్జాలో దగ్ధమైనా రెండు గోడౌన్లు, రెండు అంతస్తులు
- August 15, 2015
ఈ శుక్రవారం మధ్యాహ్నం రెండు గంటలకు సుమారు దుబాయి, డ్రాగన్ మార్ట్ వెనుక ఉన్న రెండు గోడౌన్లు పాక్షికంగా దగ్ధమైయ్యాయి. ఈ సమాచారం అందుకున్న దుబాయి సివిల్ డెఫెన్స్ శాఖ వారి కరమా, రషీదియా, అల్ రాస్ మరియు పోర్ట్ సయీద్ లలోని అగ్నిమాపక దళాలు ఘటనా స్థలానికి వెళ్ళి, అరగంటలోగా మంటలను ఆర్పివేశాయి. ఒకరు గాయపడినట్టు శాఖ వారి సమాచారం. ఇక, షార్జా లోని అల్ మజాజ్ ఏరియాలో గురువారం సాయంత్రం ఒక నిర్మాణంలో ఉన్న 22 అంతస్తుల భవనం లో మంటలు రేగగా, చురుగ్గా స్పందించిన షార్జా సివిల్ డెఫెన్స్ అధికారులు, పక్క భవనాలకూ వ్యాప్తించకుండా నిరోధించి, అక్కడి ప్రజలను, కార్లు, వాహనాలను సురక్షిత ప్రదేశాలకు తరలించడంతో పెద్ద ప్రమాదం తప్పింది.
--సి.శ్రీ(దుబాయ్)
తాజా వార్తలు
- చర్చలు విఫలమైతే బాంబులే.. ట్రంప్ హెచ్చరిక
- ఇరాన్‌తో మునుపటి సంబంధాలు అసాధ్యం..!!
- డిఫెన్స్ ఫోర్స్ సన్నద్ధతను సమీక్షించిన కింగ్ హమద్ ..!!
- 1200 ఫ్లైట్స్ నడుపుతున్న జజీరా ఎయిర్వేస్..!!
- సౌదీ అరేబియాలో 1.6% తగ్గిన ప్రాపర్టీ ధరలు..!!
- బర్కాలో ఆసియా దేశస్థుడు అరెస్టు..!!
- ఖతార్‌కు విదేశీ విమానయాన సంస్థల సేవలు పునరుద్ధరణ..!!
- IPL 2026: గుజరాత్ పై ముంబై ఘన విజయం
- నటుడు జగపతిబాబు చేతుల మీదగా రామ్ కొణికి సరికొత్త 'కొణికి లక్స్' స్కిన్ కేర్ ప్రారంభం
- మే 1 నుంచి తిరుమలలో శ్రీవారి దర్శనానికి కొత్త నిబంధనలు









