సంప్రదాయ పాస్‌వర్డ్‌లకు కాలం చెల్లినట్టే కనిపిస్తోంది!

- October 09, 2016 , by Maagulf
సంప్రదాయ పాస్‌వర్డ్‌లకు కాలం చెల్లినట్టే కనిపిస్తోంది!

 సంప్రదాయ పాస్‌వర్డ్‌లకు కాలం చెల్లినట్టే కనిపిస్తోంది! బయోమెట్రిక్‌, రెటినా లాంటి అధునాతన భద్రతా అంచెలనూ తలదన్నెలా.. సరికొత్త వ్యవస్థను పరిశోధకులు తెరపైకి తీసుకొచ్చారు. మెదడు తరంగాలతో వ్యక్తులను గుర్తించే విధానాన్ని అభివృద్ధి చేశారు. మెదడులోని చర్యలను నమోదుచేసే, పర్యవేక్షించే ఎలక్ట్రోఎన్సెఫాలోగ్రఫీ (ఈఈజీ) ఆధారంగా ఇది పనిచేస్తుంది. ఈ తరహా భద్రతా వ్యవస్థపై సైబర్‌ ముఠాలు దాడిచేసే అవకాశం చాలా తక్కువని దీన్ని అభివృద్ధిచేసిన టెక్సాస్‌ టెక్‌ వర్సిటీ పరిశోధకులు తెలిపారు. దీంతో అనుసంధానించిన కంప్యూటర్‌పై మనం పని చేస్తున్నప్పుడు.. ఈఈజీలు నిరంతరంగా మన మెదడులోని తరంగాలను నమోదు చేస్తుంటాయి.అత్యవసర సమయాల్లో మనం పక్కకు వెళ్లినప్పుడు ఎవరైనా మన కంప్యూటర్‌ను ఆధీనంలోకి తీసుకోవాలని చూస్తే.. వెంటనే లాక్‌ పడిపోతుంది. స్వచలితంగా తెరచుకునే తలుపులు, వెలిగే లైట్లు, ఫేన్లు తదితర విద్యుత్తు పరికరాలతోపాటు ఇంటర్నెట్‌ ఆఫ్‌ థింగ్స్‌ (ఐవోటీ) సాంకేతికతలోనూ ఈ పరిజ్ఞానాన్ని ఉపయోగించే అవకాశముంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com