'నక్షత్రం' చిత్రం టైటిల్‌ లోగో రామ్‌చరణ్‌ విడుదలచేశారు..

- October 09, 2016 , by Maagulf
'నక్షత్రం' చిత్రం టైటిల్‌ లోగో రామ్‌చరణ్‌  విడుదలచేశారు..

పోలీస్‌ అవ్వాలనే ప్రయత్నంలో ఉన్న ఓ యువకుడి కథతో 'నక్షత్రం' చిత్రం తెరకెక్కుతోంది. ఇందులో సందీప్‌కిషన్‌, రెజీనా నాయకానాయికలు కాగా ప్రత్యేక పాత్రలలో సాయిధరమ్‌తేజ్‌, ప్రగ్యజైస్వాల్‌ నటిస్తున్నారు. కృష్ణవంశీ దర్శకుడు. శ్రీ చక్ర మీడియా సారధ్యంలో బుట్టబొమ్మ క్రియేషన్స్‌ పతాకంపై కె.శ్రీనివాసులు, విన్‌ విన్‌ విన్‌ క్రియేషన్స్‌ పతాకంపై ఎస్‌.వేణుగోపాల్‌, సజ్జు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రం షూటింగ్‌ హైదరాబాద్‌ పరిసర ప్రాంతాలలో శరవేగంగా జరుగుతోంది.కాగా ఈ చిత్రం టైటిల్‌ లోగో విడుదలైంది. ప్రస్తుతం ధృవ చిత్రంలో నటిస్తున్న రామ్‌చరణ్‌ అదే సెట్స్‌లో ఈ చిత్రం లోగోను తన చేతులమీదుగా విడుదలచేశారు. ఇదిలావుండగా ఈ చిత్రం తొలి పది ప్రచార చిత్రాలను ప్రణాళికబద్ధంగా తగిన సమయంలో రామ్‌చరణ్‌ చేతుల విడుదల చేసేందుకు కృష్ణవంశీ సన్నాహాలు చేస్తున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com