బంపర్ ఆఫర్ కొట్టేసిన రష్మీ

- October 16, 2016 , by Maagulf
బంపర్ ఆఫర్ కొట్టేసిన రష్మీ

సిల్వర్ స్క్రీన్ మీద ఎంత బోల్డ్‌గా యాక్ట్ చేసినా.. సరైన సక్సెస్ రాక సతమతమవుతోంది జబర్దస్త్ యాంకర్ రష్మీ. వచ్చిన ప్రతి అవకాశాన్ని వదలకుండా చిన్న చిన్న సినిమాలు చేస్తున్న రష్మికి ఓ బంపర్ ఆఫర్ వచ్చినట్టు ఫిల్మ్ ఇండస్ట్రీలో న్యూస్ చక్కర్లు కొడుతోంది. డైరెక్టర్ మారుతి తన నెక్స్ట్ మూవీలో రష్మికి హీరోయిన్‌గా ఆఫర్ ఇచ్చాడట. నానితో 'భలే భలే మగాడివోయ్', వెంకీతో 'బాబు బంగారం' చెయ్యకముందు మారుతి 'ఈ రోజుల్లో', 'బస్ స్టాప్' లాంటి యూత్ కంటెంట్ వున్న మూవీస్ తీసి హిట్ కొట్టాడు.ఇప్పుడు మళ్ళీ అలాంటి యూత్ కంటెంట్ వున్న ఓ లేడీ ఓరియంటెడ్ మూవీ ప్లాన్ చేస్తున్నాడట. ఈ మూవీలో రష్మిని హీరోయిన్‌గా తీసుకోవాలనుకుంటున్నాడట.అదే నిజం అయితే.. సరైన ఆఫర్ కోసం ఎదురు చూస్తున్న రష్మికి జబర్దస్త్ ఆఫర్ వచ్చినట్టే. అయితే ఈ మూవీని మారుతి సొంతంగా నిర్మించబోతున్నాడట. మరి ఈ మూవీని మారుతి డైరెక్ట్ చేస్తాడా లేక మరెవరికైనా అవకాశం ఇస్తాడా అనేది క్లారిటీ రావాల్సి వుంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com