మెగాస్టార్ తో స్టెప్పులేయడం తన పూర్వజన్మ సుకృతమని లక్ష్మీరాయ్‌ అంటోంది

- October 16, 2016 , by Maagulf
మెగాస్టార్ తో స్టెప్పులేయడం తన పూర్వజన్మ సుకృతమని లక్ష్మీరాయ్‌ అంటోంది

మెగాస్టార్ చిరంజీవి 150వ చిత్రం 'ఖైదీ నెం.150'లో కేథరిన్ ట్రెసా బదులు.. 'తోబ..తోబ' గర్ల్ లక్ష్మీరాయ్‌కి భలే ఛాన్స్ లభించింది. ఇది తన లక్ అని మురిసిపోతూ తన ట్విటర్‌లో.. తమ ఫొటోను పోస్ట్ చేసింది. 'చిరంజీవిగారితో ఈ సినిమాలో ఐటం సాంగ్ చేస్తున్నానంటే ఆ ఆనందాన్ని మాటల్లో చెప్పలేను.. ఆయన అంటే నాకెంతో అభిమానం' అని పేర్కొంది లక్ష్మీ రాయ్.చిరు బ్రదర్ పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్‌తో 'సర్దార్' మూవీలో ఊరించిన ఈ అమ్మడు.. ఇప్పడు మెగాస్టార్ తో స్టెప్పులేయడం తన పూర్వజన్మ సుకృతమని అంటోంది. ఈ ఐటం సాంగ్ చిరంజీవి కుమార్తె సుస్మిత పర్యవేక్షణలో సాగడం విశేషం. సుస్మితతో గొడవ పడడంవల్లే కేథరిన్ ఈ చిత్రం నుంచి ఔట్ అయిందని వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com