ఫిలిపీన్స్‌ దేశాన్ని మరోసారి తుపాను అల్లకల్లోలం చేసింది

- October 16, 2016 , by Maagulf
ఫిలిపీన్స్‌ దేశాన్ని మరోసారి తుపాను అల్లకల్లోలం చేసింది

ఫిలిపీన్స్‌ దేశాన్ని మరోసారి తుపాను అల్లకల్లోలం చేసింది. ఆదివారం ఉదయం కారికా(కరేన్‌) తుపాను చెలరేగడంతో ఇద్దరు వ్యక్తులు మృతి చెందగా, వందలమంది నిరాశ్రయులయ్యారు. వరదల ధాటికి గల్లంతైన వారి సంఖ్య తెలియడం లేదు. గంటకు 130కి.మీ. నుంచి 220కి.మీ. వేగంతో వీచిన పెనుగాలులతో అనేక చోట్ల భారీ వృక్షాలు నేలకూలాయి.
పలు చోట్ల ఇళ్లు ధ్వంసమయ్యాలు, విద్యుత్‌ స్తంభాలు దెబ్బతినడంతో అనేక ప్రాంతాలు అంధకారంలో చిక్కుకుపోయాయి. తీరప్రాంతాల ప్రజల్ని వెంటనే సురక్షిత ప్రాంతాలకు తరలించి, గాయపడ్డవారికి చికిత్స చేయిస్తున్నట్లు అధికారులు తెలిపారు.

చేపల వేటకు వెళ్లిన ముగ్గురు మత్స్యకారులు అదృశ్యమైనట్లు అధికారులు వెల్లడించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com