స్నేహ సంబంధాలలో గొప్ప మైలురాయిని దాటిన యు.ఏ.ఈ. - భారత్
- August 18, 2015
యు.ఏ.ఈ. ప్రధాని, దుబాయి పరిపాలకుడు - హిజ్ హైనెస్ షేక్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తౌమ్, దుబాయి యువరాజు - షేక్ హందాన్ బిన్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తౌమ్ మరియు దుబాయి ఉపాధినేత షేక్ మక్తౌమ్ బిన్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తౌమ్ వారి సమక్షంలో, భారత ప్రధాని నరేంద్ర మోడిని సోమవారం మధ్యాహ్నం జబీల్ రాజభవనంలో స్వాగతించారు. ఇరుదేశాల మధ్య, ప్రజల మధ్య ఉన్న చారిత్రాత్మక గాఢ స్నేహ సంబంధాలను ఆయన నొక్కివక్కాణించారు. భారత ప్రజలకు పెద్దసంఖ్యలో ఆతిధ్యమిస్తున్న తమ అతిగొప్ప మిత్రులుగా యూ. ఏ. ఈ. ని, వారి పాలకులను భారత ప్రధాని అభివర్ణించారు. అనంతరం, ఇరువురు అధినేతలు రెండు దేశాలు, వివిధ వర్గాల ప్రజల మధ్య పరస్పర సహకారాన్ని పెంచడానికి అవసరమైన వ్యూహాత్మక చర్యలను గూర్చి చర్చించారు.
--సి.శ్రీ(దుబాయ్)
తాజా వార్తలు
- కర్ణాటక ప్రభుత్వం సంచలన నిర్ణయం..
- వాహనదారులకు ఊరట
- ఆస్కార్స్ 2026 ప్రజెంటర్‌గా ప్రియాంక చోప్రా
- పిల్లలు, కార్మికులకు భరోసా ఇవ్వండి: కువైట్ అంతర్గత మంత్రిత్వ శాఖ విజ్ఞప్తి
- ఆన్లైన్లో మిస్ లీడ్ కంటెంట్ స్ప్రెడ్.. 194 మంది అరెస్టు..!!
- ఖతార్‌లోని అల్-ఉదీద్ వైమానిక స్థావరంపై డ్రోన్ దాడి..!!
- మనామాలో హోటళ్ళు, నివాస భవనానికి నష్టం..!!
- కువైట్‌లో చిక్కుకున్న ప్రయాణీకులతో టచ్ లో ఎంబసీ..!!
- మిడిల్ ఈస్ట్, ఒమన్‌లో CBSE పరీక్షలు రద్దు..!!
- అరబ్ దేశాలపై ఇరాన్ దాడులను ఖండించిన కౌన్సిల్..!!









