హత్య కేసులో సౌదీ యువరాజు ఉరితీత
- October 18, 2016
మనామా: సౌదీ అరేబియా, గురువారం ప్రిన్స్ టుర్కి బిన్ సౌది బిన్ టుర్కి బిన్ సౌద్ అల్ కబిర్‌ని ఉరితీసింది. ఓ వివాదంలో సౌదీ వ్యక్తిని హతమార్చిన కేసులో ఈ ఉరిశిక్షను అమలు చేశారు. ఇంటీరియర్ మినిస్ట్రీ, ఓ ప్రకటనలో ఉరితీత విషయాన్ని వెల్లడించింది. రియాద్‌లో ఉరితీత జరిగినట్లు అందులో పేర్కొంది. అదెల్ బిన్ సులైమాన్ బిన్ అబ్దుల్ కరీమ్ అల్ ముమౌమీద్ అనే సౌదీ వ్యక్తిని హతమార్చిన కేసులో టుర్కి బిన్ సైద్ నిందితుడు. నిందితుడ్ని అరెస్టు చేసి, న్యాయస్థానం ముందు నిల్చోబెట్టడం, నేర నిరూపణ జరగడంతో, హై కోర్టు మరణ శిక్ష విధించడం జరిగాయి. ఉరిశిక్షకు సంబందించి రాయల్ ఆర్డర్ కూడా విడుదలయ్యింది. రియాద్‌లోని తమమామా ప్రాంతంలో మూడేళ్ళ క్రితం జరిగింది ఈ హత్యోదంతం.
తాజా వార్తలు
- మే 1 నుంచి తిరుమలలో శ్రీవారి దర్శనానికి కొత్త నిబంధనలు
- JEE మెయిన్స్ తుది ఫలితాలు వచ్చేశాయ్..
- ఏపీకి కేంద్ర ప్రభుత్వం గొప్ప శుభవార్త
- కాంగ్రెస్ ప్రభుత్వంకు కేసీఆర్ డెడ్‌లైన్
- కరీంనగర్లో ఘనంగా 'కార్తికేయ జువెలరీస్' ప్రారంభోత్సవం
- యూఏఈలో ఉగ్రవాద సంస్థ భగ్నం: దేశ భద్రతను దెబ్బతీయాలన్న కుట్ర విఫలం
- బహ్లా కోటలో నాలుగు కొత్త మ్యూజియమ్స్ ప్రారంభం..!!
- ఖతార్ మున్సిపాలిటీలో ఈకో ఫ్రెండ్లీ వెహికల్స్, పరికరాలు..!!
- ప్రవాసుల బ్యాంకు ఖాతాలపై కువైట్ పర్యవేక్షణ కఠినతరం..!!
- ఇండియన్ స్కూల్ బహ్రెయిన్ పై పేరెంట్స్ ప్యానెల్ విమర్శలు..!!









