షార్జాలో 4 సింహాలు సహా, పలు పెంపుడు జంతువుల స్వాధీనం
- October 18, 2016
నాలుగు సింహాలు, పలు పెంపుడు జంతువుల్ని షార్జా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు ఈ ఏడాది ఇప్పటిదాకా. షార్జా ఎన్విరాన్‌మెంట్ అండ్ నేచురల్ రిజర్వ్స్ అథారిటీ డైరెక్టర్ జనరల్ హనా సైఫ్ అల్ సువైది మాట్లాడుతూ, నాలుగు సింహాలు, మూడు పైథాన్స్, రెండు క్రోకడైల్స్, మరికొన్ని వైల్డ్ యానిమల్స్‌ని స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. షార్జా పోలీసులతో కలిసి సంయుక్తంగా నిర్వహించిన సోదాల్లో ఈ జంతువులు బయటపడ్డాయి. సింహాల అరుపులతో ఇబ్బంది పడుతున్న కొందరు, వాటిపై ఫిర్యాదు చేయడంతో తాము రంగ ప్రవేశం చేసినట్లు ఆయన వివరించారు. స్వాధీనం చేసుకున్న వైల్డ్ యానిమల్స్‌కి సంబంధించి ఒక్కో ఓనర్‌కి 100,000 దిర్హామ్ జరీమానా విధించే అవకాశం ఉందనీ, స్వచ్ఛందంగా తమ వైల్డ్ యానిమల్స్‌ని అప్పగించేవారికి ఈ ఫైన్ నుంచి మినహాయింపు ఇస్తూ షార్జా జరూలర్ గతంలోనే డిక్రీ విడుదల చేసినట్లు చెప్పారాయన. నవంబర్ 2015లో ఈ డిక్రీ విడుదలైంది. డిక్రీ తర్వాత నెల రోజులు అమ్నెస్టీ ఇచ్చారు కూడా. అయినప్పటికీ తమ జంతువుల్ని స్వాధీనం చేయనివారిపై చర్యలకు ఉపక్రమించారు.
తాజా వార్తలు
- బహ్లా కోటలో నాలుగు కొత్త మ్యూజియమ్స్ ప్రారంభం..!!
- ఖతార్ మున్సిపాలిటీలో ఈకో ఫ్రెండ్లీ వెహికల్స్, పరికరాలు..!!
- ప్రవాసుల బ్యాంకు ఖాతాలపై కువైట్ పర్యవేక్షణ కఠినతరం..!!
- ఇండియన్ స్కూల్ బహ్రెయిన్ పై పేరెంట్స్ ప్యానెల్ విమర్శలు..!!
- అబుదాబిలో 4 దర్బ్ టోల్ గేట్ల పేర్లలో మార్పులు..!!
- ఇంధన భద్రతపై సౌదీ-భారత్ చర్చలు..!!
- హైదరాబాద్: 32 మంది బ్యాంకు అధికారుల అరెస్ట్..
- గచ్చిబౌలిలో భారీ అగ్నిప్రమాదం: 15 బైకులు దగ్ధం
- ఒమన్ గల్ఫ్‌లో ముదిరిన ఉద్రిక్తతలు
- మలేషియాలో ఘోర అగ్నిప్రమాదం..వెయ్యి ఇళ్లు దగ్ధం









