దుబాయ్ సౌత్ గా పేరు మార్చుకున్న దుబాయ్ వరల్డ్ సెంటర్

- August 21, 2015 , by Maagulf
దుబాయ్ సౌత్ గా పేరు మార్చుకున్న దుబాయ్ వరల్డ్ సెంటర్

145 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం గల ప్లాన్డ్ సిటీ ఐన దుబాయి వరల్డ్ సెంటర్ ను, శాసనం సంఖ్య. 11, 2015 ప్రకారం 

దుబాయి సౌత్ గా మారుస్తూ దుబాయ్ పరిపాలకుడు, యు. ఏ. ఈ. ప్రధాని మరియు ఉపాధ్యక్షులు,  హిజ్ హైనెస్ 

షేక్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తౌమ్ చట్టం చేశారు.  దీని లోగోలో ఉన్న ఆకుపచ్చ రంగు జీవితాన్ని, నీలి రంగు 

వాణిజ్యాన్ని సూచిస్తాయి. ఈ సందర్భంగా శ్రీ మక్తౌమ్ మాట్లాడుతూ, రానున్న సంవత్సరాలలో ఈ పేరు ఒక చిహ్నంగా, 

వెంటనే గుర్తించగలిగేదిగా ఉంటుందని అన్నారు. ఇది ఎమిరేట్స్ యొక్క అస్తిత్వమనీ, దుబాయి ప్లాన్ 2021 ప్రకారం 

ఆనందకర సంఘటనల సమాహారంగా విలసిల్లగలదని ఆశించారు.

--సి.శ్రీ(దుబాయ్)

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com