యూఏఈ బిలియనీర్ చేతికి 'రెమిట్ టు ఇండియా'
- October 26, 2016
యూఏఈ కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న బిలియనీర్ బిఆర్ శెట్టికి చెందిన గ్లోబల్ రెమిటీ సంస్థ యూఏఈ ఎక్స్‌ఛేంజ్, ఇండియాకి చెందిన రెమిటీ టు ఇండియా సంస్థను భారీ మొత్తానికి సొంతం చేసుకున్నట్లు తెలియవస్తోంది. టైమ్స్ ఆఫ్ మనీ నుంచి ఈ సంస్థను సొంతం చేసుకుంది బిఆర్‌షెట్టికి చెందిన యూఏఈ ఎక్స్‌ఛేంజ్. 2000 సంవత్సరంలో రెమిట్ టు ఇండియా ఏర్పాటయ్యింది. 500,000 మందికి వైగా వినియోగదారులతో (ఎక్కువమంది వలసదారులే) అతి పెద్ద సంస్థల్లో ఒకటిగా వర్ధిల్లుతోంది. యూఎస్, కెనడా మరియు ఆస్ట్రేలియాకి చెందిన వినియోగదారులే ఎక్కువ ఈ సంస్థకి. వినియోగదారులకు నమ్మకమైన రెమిటెన్సీ సర్వీసులు అందించడం ద్వారా అనతికాలంలోనే మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదించుకుంది రెమిట్ టు ఇండియా. యూఏఈ ఎక్స్‌ఛేంజ్ గ్రూప్ సీఈఓ ప్రమోద్ మంగాత్ మాట్లాడుతూ, డిజిటల్ యుగంలో సరికొత్త ఆవిష్కరణలు చోటుచేసుకుంటున్నాయనీ, ఈ తాజా అవకాశంతో తమ కార్యకలాపాలు మరింత విస్తరించనున్నాయని అన్నారు. రెగ్యులేటరీ అప్రూవల్స్‌ని బట్టి 2017 తొలి క్వార్టర్‌లో డీల్ క్లోజ్ కానున్నట్లు తెలియవస్తోంది.
తాజా వార్తలు
- బహ్లా కోటలో నాలుగు కొత్త మ్యూజియమ్స్ ప్రారంభం..!!
- ఖతార్ మున్సిపాలిటీలో ఈకో ఫ్రెండ్లీ వెహికల్స్, పరికరాలు..!!
- ప్రవాసుల బ్యాంకు ఖాతాలపై కువైట్ పర్యవేక్షణ కఠినతరం..!!
- ఇండియన్ స్కూల్ బహ్రెయిన్ పై పేరెంట్స్ ప్యానెల్ విమర్శలు..!!
- అబుదాబిలో 4 దర్బ్ టోల్ గేట్ల పేర్లలో మార్పులు..!!
- ఇంధన భద్రతపై సౌదీ-భారత్ చర్చలు..!!
- హైదరాబాద్: 32 మంది బ్యాంకు అధికారుల అరెస్ట్..
- గచ్చిబౌలిలో భారీ అగ్నిప్రమాదం: 15 బైకులు దగ్ధం
- ఒమన్ గల్ఫ్‌లో ముదిరిన ఉద్రిక్తతలు
- మలేషియాలో ఘోర అగ్నిప్రమాదం..వెయ్యి ఇళ్లు దగ్ధం









