సిమెంట్ ధరలు తగ్గించాలని కేబినెట్‌ సబ్‌కమిటీ ఆదేశo...

- October 26, 2016 , by Maagulf
సిమెంట్ ధరలు తగ్గించాలని కేబినెట్‌ సబ్‌కమిటీ ఆదేశo...

ఎన్టీఆర్ హౌసింగ్ ద్వారా 2 లక్షల ఇళ్ల నిర్మాణాలకు 19 లక్షల టన్నుల సిమెంట్ అవసరం కానుంది. చంద్రన్న రోడ్లు, ఇతర నిర్మాణాలకు 15 లక్షల టన్నుల సిమెంట్‌ అవసరం ఉందని అధికారులు అన్నారు. ఎన్టీఆర్ హౌసింగ్ ద్వారా 2 లక్షల ఇళ్ల నిర్మాణాలకు రూ.230కి, చంద్రన్న రోడ్లు, ఇతర నిర్మాణాలకు రూ.240కి సిమెంట్ సరఫరా చేయాలన్నారు. పిపిసి రకం సిమెంట్ గతంలో రూ.240 ఉన్న ధరను రూ.230 కి... ఓపిసి రకం సిమెంట్ రూ.250 ఉన్న ధర రూ. 240 కి తగ్గనున్నాయి. పేదప్రజలను దృష్టిలో పెట్టుకుని సిమెంట్ ధరలు తగ్గించాలని సిమెంట్ కంపెనీల యాజమాన్యాన్ని కేబినెట్‌ సబ్‌కమిటీ ఆదేశించింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com