భారత్‌ తన తదుపరి మ్యాచ్‌లో జర్మనీతో తలపడనుంది.

- October 26, 2016 , by Maagulf
భారత్‌ తన తదుపరి మ్యాచ్‌లో జర్మనీతో తలపడనుంది.

5వ నేషనల్‌ ఇన్విటేషనల్‌ హాకీ టోర్నమెంట్‌లో భారత జూనియర్‌ మహిళల జట్టు తన ఖాతాలో మరో విజయం నమోదు చేసుకుంది. స్పెయిన్‌తో జరిగిన మ్యాచ్‌లో భారత్‌ 3-2తేడాతో విజయాన్ని దక్కించుకుంది.ఆట ప్రారంభమైన 15వ నిమిషంలో స్పెయిన్‌ క్రీడాకారిణి క్లారా మొదటి గోల్‌ చేసి తన జట్టును ఆధిక్యంలోకి తీసుకెళ్లింది. 28వ నిమిషంలో భారత క్రీడాకారిణి జ్యోతి గోల్‌ చేయడంతో ఇరు జట్ల స్కోరు సమమైంది. 42వ నిమిషంలో పెనాల్టి కార్నర్‌ ద్వారా రీతూ గోల్‌ చేసి భారత్‌ను ఆధిక్యంలోకి తీసుకెళ్లింది. రెండు నిమిషాల వ్యవధిలోనే స్పెయిన్‌ క్రీడాకారిణి గోల్‌ చేయడంతో మరోసారి జట్టు స్కోరు సమమైంది.ఈ సమయంలో ఇరుజట్ల మధ్య పోరు హోరాహోరీగా సాగింది. చివరి 10నిమిషాల సమయంలో గోల్‌ చేసేందుకు భారత్‌ శాయశక్తులా కృషి చేసింది. ఈ క్రమంలో సంగీత కుమారి గోల్‌ చేయడంతో 3-2 ఆధిక్యంలోకి దూసుకెళ్లి స్పెయిన్‌పై విజయాన్ని నమోదు చేసింది.
భారత్‌ తన తదుపరి మ్యాచ్‌లో జర్మనీతో తలపడనుంది. ఈ మ్యాచ్‌ ఈ నెల 27న జరగనుంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com