యూ/ఏ సర్టిఫికెట్‌ పొందిన 'కాష్మోరా'

- October 26, 2016 , by Maagulf
యూ/ఏ సర్టిఫికెట్‌ పొందిన 'కాష్మోరా'

కార్తీ, నయనతార, శ్రీదివ్య ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం కాష్మోరా. ఈ చిత్ర సెన్సార్‌ పూర్తి చేసుకొని యూ/ఏ సర్టిఫికెట్‌ పొందినట్టు బుధవారం చిత్ర బృందం వెల్లడించింది. దీపావళి కానుకగా అక్టోబర్‌ 28న ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నారు. గోకుల్‌ దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి పెరల్‌ వి.పొట్లూరి, పరమ్‌ వి.పొట్లూరి, కెవిన్‌ అన్నె, ఎస్‌.ఆర్‌.ప్రకాష్‌బాబు, ఎస్‌.ఆర్‌.ప్రభులు నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. ఈనెల 7వ తేదీన విడుదలైన ఈ చిత్ర తమిళ ట్రైలర్‌కు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వస్తోంది.డ్రీమ్‌ వారియర్‌ పిక్చర్స్‌ పతాకంపై నిర్మిస్తున్న ఈ చిత్రం తెలుగు, తమిళ భాషల్లో రూపొందింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com