కశ్యప్ ఎదుగుదలకు కారణం రామ్‌గోపాల్ వర్మ!
- October 27, 2016
అనురాగ్ కశ్యప్.. బాలీవుడ్లో అతనో బ్రాండ్. నిర్మాతగా, దర్శకుడిగా, కథకుడిగా ఆయన అందరికీ సుపరిచితుడే. అయితే అతను ఈ స్థాయికి రావడం వెనుక ఒక వ్యక్తి ఉన్నాడు. ఆయన ఎవరో కాదు.. సంచలన దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ. మిగతా వ్యవహారలు ఎలా ఉన్నా.. నిజమైన టాలెంట్ గుర్తించి, వారిని తగు విధంగా ప్రోత్సహించి, వారికి దక్కాల్సిన క్రెడిట్ వారికి ఇచ్చి ఎంతో మంది దర్శకులను తయారు చేశాడు వర్మ. కృష్ణవంశీ, పూరీ జగన్నాథ్, తేజ, అనురాగ్ కశ్యప్.. ఈ జాబితా చాలా పెద్దదే. సినీ ఇండస్ట్రీలో ఎవరితోనూ పరిచయం లేకపోయినా ముంబైకి వచ్చేశాడు అనురాగ్ కశ్యప్. తీరా ముంబై వచ్చాక అవకాశాల సంగతి దేవుడెరుగు.. ఆయన మాటలు కూడా ఎవరూ వినేవారు కాదట.ఏం చేయాలో తెలియక ముంబైలోని పృథ్వి థియేటర్లో స్టేజ్ తుడిచే పనిలో చేరాడట. అలా ఖాళీగా ఉన్న సమయాల్లో స్ర్కిప్టులు రాసుకునేవాడట. అలా చాలా సీరియళ్లకు ఫ్రీగా రాశాడట. ఆయన స్ర్కిప్టులను వాడుకోవడమే తప్ప..ఎవరూ కశ్యప్‌కు క్రెడిట్ ఇచ్చేవారు కాదట. అయితే రామ్‌గోపాల్ వర్మ దర్శకత్వం వహించిన 'సత్య'కు అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేసే అవకాశం రావడంతో కశ్యప్ దశ తిరిగింది. ఆ సినిమాతో తొలిసారి అనురాగ్ పేరు స్ర్కీన్‌పై పడింది. దాంతో మనోడి ప్రతిభను అందరూ గుర్తించడం మొదలుపెట్టారు.అప్పట్నుంచే కశ్యప్ ఎదుగుదల ప్రారంభం అయింది. ఈ విషయాలను స్వయంగా అనురాగ్ వెల్లడించాడు.
తాజా వార్తలు
- క్షిపణుల అడ్డుకట్ట దృశ్యాలు చిత్రీకరించి సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన వ్యక్తి అరెస్ట్
- క్షతగాత్రులను పరామర్శించిన కువైట్ రక్షణ మంత్రి షేఖ్ అబ్దుల్లా అలీ
- హిజ్రీ నూతన సంవత్సరానికి యూఏఈలో జూన్ 15న సెలవు
- ఇరాన్ దాడిలో ఒకరు మృతి.. 63 మందికి గాయాలు, అత్యవసర పరిస్థితిలో కువైట్ ఆసుపత్రులు
- వేస్ట్ మేనేజ్మెంట్ లో గణనీయంగా తగ్గిన ఉల్లంఘనలు..!!
- ఒమన్ లో భానుడి ప్రతాపం.. 50 డిగ్రీలకు ఉష్ణోగ్రతలు..!!
- ప్రజలకు కీలక సూచనలు చేసిన కువైట్ సైన్యం..!!
- షార్జా బాలుడి మృతి కేసులో నేబర్ ఫ్యామిలీలకు బెయిల్..!!
- ఖతార్ లో పర్సనల్ డేటా ప్రైవసీ.. పరిరక్షణకు NCSA ఫ్రేమ్‌వర్క్ ఆవిష్కరణ..!!
- బ్రెయిన్ ట్యూమర్ ను గుర్తించడంలో వైఫల్యం.. డాక్టర్ కు ఫైన్..!!









