ఈద్ బలిదానానికి బహ్రెయిన్ కు రానున్న పశుసంపద

- August 23, 2015 , by Maagulf
ఈద్ బలిదానానికి బహ్రెయిన్ కు రానున్న పశుసంపద


మహమ్మద్ ప్రవక్త,  అల్లా మీద ఆచంచల విశ్వాసంతో భగవంతుని సమర్పణకై తన కుమారుణ్ణి బలిదాన మొనర్చిన ఈద్ అల్ అదా పర్వదినాన్ని పురస్కరించుకుని  సుమారు పదివేల గొర్రెలు నేడు బహ్రైన్ కు రానున్నాయి. ఈ మతసంబంధమైన సెలవుదినాన, ఈద్ ప్రార్ధనలు, గొర్రేను బలిదానమివ్వడం, అందులో మూడవ వంతు మాంసాన్ని పొరుగువారికి, బంధువులకు; మరో మూడవ వంతు పేద సాదలకు దానమీయడం రివాజు. అందుకే, బహ్రైన్ లైవ్ స్టాక్ కంపెనీ వారు 60,000 గొర్రెలకు పైగా దిగుమతి చేసుకుంటుండగా, వా నిలో 30,000 ఈరోజు రానున్నాయి; రెండవ దఫాలో మిగిలినవి వచ్చే వారం ఆస్ట్రేలియా నుండి రానున్నాయి.  మాంసంపై సబ్సిడీ తొలగించినప్పటికీ, సరసమైన ధరకే ఈద్ మాంసాన్ని అమ్ముతామని కంపెనీ హామీ ఇచ్చింది.


--యం.వాసుదేవ రావు(మాగల్ఫ్ ప్రతినిధి,బహ్రెయిన్)

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com