ఇండియన్ ట్యాక్స్ చెల్లించడానికి 7 రోజులు మాత్రమే వ్యవధి

- August 25, 2015 , by Maagulf
ఇండియన్ ట్యాక్స్ చెల్లించడానికి 7 రోజులు మాత్రమే వ్యవధి

ప్రవాస భారతీయులు, ఇండియాలో  ట్యాక్స్ రిటర్న్ ఫైల్ చేయనవసరం లేదనే జనాభిప్రాయానికి వ్యతిరేకంగా, NRI ల యొక్క ఆదాయం స్వదేశంలో నెలకు  1,150దీనర్లు (రూ. 20,833/-) కంటే ఎక్కువ ఉన్నట్లైతే అతడు లేదా ఆమె ఆదాయ పన్ను రెటర్న్స్ ను ఫైల్ చేయవలసిఉంటుంది. అంటే స్వదేశంలో అద్దెలు లేదా డిపాజిట్లపై వడ్డీలు వంటివాటి ద్వారా మీ సంవత్సరాదాయం రూ. 2,50,000/- కంటే ఎక్కువైనత్టైతే, ఆది తప్పనిసరి అని ఐచ్చికం కాదని, ఐతే ఇందుకోసం మీరు ఇండియాకు వెళ్లనవసరం లేదని, ఆదాయపన్ను శాఖ వారి ఈ- ఫిల్లింగ్ పోర్టల్ ద్వారా చెల్లించవచ్చని, లేదా అనేకమంది ట్యాక్స్ ఏజెంట్ల ద్వారా ఐనా చెల్లించవచ్చని ఆ శాఖ వారు వివరించారు.

 

--సి.శ్రీ(దుబాయ్) 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com