ఖతార్‌ జనాభా ఆల్‌ టైమ్‌ హై 2.6 మిలియన్లు

- November 01, 2016 , by Maagulf
ఖతార్‌ జనాభా ఆల్‌ టైమ్‌ హై 2.6 మిలియన్లు

ఖతార్‌: ఖతార్‌ జనాభా 2.6 మిలియన్ల మార్క్‌ని చేరుకుంది. ఇది ఆల్‌ టైమ్‌ హైగా పేర్కొంటున్నారు. మినిస్ట్రీ ఆఫ్‌ డెవలప్‌మెంట్‌ ప్లానింగ్‌ అండ్‌ స్టాటిస్టిక్స్‌ (ఎండిపిఎస్‌) వెల్లడించిన వివరాల ప్రకారం, ఖతార్‌లో 2,611,000 మంది నివాసితులు ఉన్నారు. అక్టోబర్‌ చివరి నాటికి నమోదైన ఈ గణాంకాలు సెప్టెంబర్‌తో పోల్చితే 2.3 శాతం అధికం. సెప్టెంబర్‌లో కంట్రీ పాపులేషన్‌ 2,553,000గా ఉంది. ఈ ఏడాది ఇప్పటిదాకా అత్యధికంగా నమోదైన సంఖ్య 2,587,000. మేలో ఈ సంఖ్య నమోదయ్యింది. జులైలో అత్యల్పంగా 2,326,000 సంఖ్య నమోదయ్యింది. సెలవుల కారణంగా వలసదారులు వెకేషన్‌లో ఉండటమే ఇందుకు కారణం. గత ఏడాది ఇదే సమయానికి నమోదైన గణాంకాలతో పోల్చితే ఈ ఏడాది నమోదైన 2.6 మిలియన్‌ సంఖ్యకున్న వ్యత్యాసం 8.3 శాతంగా లెక్కలు తేల్చారు. 2000 సంవత్సరంలో 614,000 మంది జనాభా ఉండగా, ఇది 2006లో తొలిసారిగా 1 మిలియన్‌ మార్క్‌ని దాటింది. 2008లో 1.5 మిలియన్‌ మార్క్‌ని చేరుకుంది. అక్కడినుంచి ప్రతి యేడాదీ క్రమంగా పెరుగుతూ వస్తోంది. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com